BigTV English

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..

SA vs IND 3rd ODI : భారత యువ జట్టు అదరగొట్టింది. గత జనవరిలో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు కుర్ర జట్టు దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలోనే దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంది. గత సిరీస్ లో ఆటగాళ్లెవరూ జట్టులో లేకపోయినా.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో యువ జట్టు దక్షిణాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్‌ పట్టేసింది. గురువారం ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది.


సంజు శాంసన్‌ 108 పరుగులతో సెంచరీ చేయగా.. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 77 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సంజు శాంసన్ నిలవగా.. అర్షదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. అంతకు ముందు టీ-20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. జనవరి 26 నుంచి టెస్టు సిరీస్‌ జరగనుంది.


.

.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×