E-Paper
Advertisement

Lost votes: మీ ఓటు భద్రమేనా? తస్మాత్ జాగ్రత్త

Lost votes: మీ ఓటు భద్రమేనా? తస్మాత్ జాగ్రత్త
Advertisement

Lost votes : 2018 వ సంవత్సరం
డిసెంబర్ 7,
తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతోంది.
ఉదయం నుంచి మొదలు మధ్యాహ్నం, సాయంత్రం,
రాత్రి వరకు ఒకటే మాట..
మా ఓటు లేదు.. మా ఓటు లేదు..
మా ఓటు పోయింది.. మా ఓటు కనిపించడం లేదు..
ఇదే మాట.. పబ్లిక్ నుంచి హోరెత్తిపోయింది.
ఇక జంట నగరాల్లో అయితే చాలామంది వీధుల్లోకి వచ్చి గగ్గోలు పెట్టారు.
ఆనాటి పోలింగ్ సిత్రాలు మీకోసం..

మేం హైదరాబాద్ సిటీలో 12 ఏళ్లుగా ఉంటున్నాం. మా ఇంట్లో అద్దెకు ఉన్నవాళ్లకు ఓటు వచ్చింది.. ఇంటి ఓనర్లమైన మాకు లేవు. ఇదెక్కడి సోద్యమో తెలీడం లేదు.

Advertisement

స్టార్ షట్లర్ గుత్తా జ్వాల తన ఓటు గల్లంతు అయ్యిందని తెలిపింది. నాన్న, చెల్లి ఓట్లు పోయాయి, అమ్మ ఓటు మాత్రమే ఉందని తెలిపింది.

కొందరు ఆన్ లైన్ లో ఓటరు స్లిప్ తీసుకుని, ఓటు వేసేందుకు వెళితే, బూత్ లోని ఓటర్ల లిస్ట్ లో పేరు లేకపోవడంతో ఘోల్లుమన్నారు.

Advertisement

పోలింగ్ బూత్ ఉదయం 7 గంటలకి తీస్తే, తాము 9 గంటలకి వెళ్లామని, అప్పటికే మా ఓటు ఎవరో వేసేశారని బాధితులు కొందరు వాపోయారు.

తెలంగాణలో ఎన్నికలకు 20 రోజుల ముందు వరకూ ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నా చివరకు పోల్ చిట్టీలలో పేరు లేకపోవడంతో షాక్ తిన్నామని కొందరన్నారు.

ఓటు వేసే విషయంలో యాక్టివ్ గా ఉండే ప్రజలు, నేతలు, ప్రముఖుల ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపింది. ఎన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా ఓటేసే వారి పేర్లు కూడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పోలింగ్ ముగిసిన తర్వాత మహిళలైతే రోడ్లు ఎక్కారు. మా ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి..అంటూ ఓటర్ కార్డులను పట్టుకుని హడావుడి చేశారు.

‘ఢిల్లీలో 30 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఇలానే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణ

ఇప్పుడు 2023 సంవత్సరం…
మరో రెండురోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరగబోతోంది. మళ్లీ  2018 ఆనాటి ముచ్చట్లు తిరిగి రిపీట్ అయ్యే అవకాశాలున్నాయని గట్టిగా చెబుతున్నారు. అప్పుడు కేసీఆర్ గెలుస్తారనే చిన్న హోప్ అయినా ఉండేది. కానీ ఇప్పుడెక్కడ చూసినా కాంగ్రెస్సు పేరే వినిపిస్తోంది. అందుకని ఓట్లు గల్లంతు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మీ ఓటు భద్రమేనా? తస్మాత్ జాగ్రత్త.. ఒకసారి ఆన్ లైన్ లో చెక్ చేసుకొమ్మని నెట్టింట మెసేజ్ లు వస్తున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుల్లు బీపీలో ఉన్నారని, ఎక్కడైనా హడావుడి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు.. ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో పకడ్బందీగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్లను పక్కాగా పెట్టుకుని వారికి దిశా నిర్దేశం చేశారు. ఎక్కడే చిన్న తేడా జరిగినా ఇమ్మీడియట్ గా రాష్ట్ర నాయకత్వానికి  తెలియజేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×