E-Paper
Advertisement

Mahabubabad Municipal: ఆ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా నేనా? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్!

Mahabubabad Municipal: ఆ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా నేనా?  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్!
Advertisement

Mahabubabad Municipal:  మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా.. నేనా? అనే సవాళ్ల మధ్య నడుస్తోంది. నిన్న మొన్నటిదాకా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక నాయకుడు నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సరైన చైర్మన్ అభ్యర్థి దొరకకపోవడంతో స్వయంగా మాజీ ఎమ్మెల్యే కూతురు తేజస్విని తో నామినేషన్ దాఖలు చేయించారు. 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉందని నమ్మిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడ ఆయన కూతురిని పోటీలోకి దింపారు.

కేంద్రంలో హాట్ టాపిక్

Advertisement

కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మూడు బాలు చౌహన్ కూడా ఎస్టీ సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాలు అక్కడ ఉండడంతో 20వ వార్డు నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమై నామినేషన్ దాఖలు చేశారు. దీంతో 20 వ వార్డ్ ప్రస్తుతం మహబూబాబాద్ మునిసిపాలిటీ కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది. క్కడ అత్యధికంగా నిరుపేద వర్గాలకు సంబంధించిన ప్రజలతోపాటు కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. దీంతో చైర్మన్ అభ్యర్థి రేసులో ఉన్న ఇరు పార్టీల వార్డు కౌన్సిలర్లు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సై అంటూ ముందుకు సాగుతున్నారు.

Also Read: IND VS PAK: చేత‌కానీ ద‌ద్ద‌మ్మ‌లు..ఇండియాతో మ్యాచ్ అంటే పారిపోయారు, పాక్ ప‌రువు తీసిన లేడీ యాంక‌ర్‌

Advertisement

20వ వార్డు వేదిక చైర్మన్ పీఠం కోసం ప్రణాళిక హబూబాబాద్ చైర్మన్ పీఠం కోసం 20వ వార్డు వేదికగా నిలువనుందా? ఇక్కడి నుంచే చైర్మన్ అభ్యర్థులు పోటీ చేసేందుకు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు? ఇక్కడ పోటీలో నిలిచే అభ్యర్థులు ఒకరు మాజీ ఎమ్మెల్యే కూతురు అయితే, మరొకరు రెండు దఫాలుగా మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థి కావడం గమనార్హం. ఇద్దరూ కూడా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారే కావడంతో ఇక్కడ వార్డు ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

చౌహన్ కు ఇస్తారా? లేదా?

గెలుపెవరిదైనా లక్ష్యం మాత్రం పీఠం కోసమేనని అనుకుంటున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థి రేసు కోసమే ఇక్కడ నుంచి తేజస్విని పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తొలుత మూడు బాలు చౌహన్ చైర్మన్ రేసులో ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి బ్రేక్ పడినట్టుగా అర్థమవుతుంది. వార్డు కౌన్సిలర్లు గెలిచాకనే చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ హై కమాండ్ నిర్దేశించడంతో చైర్మన్ అభ్యర్థి ఇక్కడ గెలిచిన మూడు బాలు చౌహన్ కు ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Also Read: Illu  Illalu Pillalu Today Episode: కూతురు కోసం తల్లడిల్లిన రామరాజు.. సేన ఇంట్లోకి అడుగుపెట్టిన అమూల్య.. అయ్యో రామరాజా..!

Related News

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

Big Stories

Advertisement
×