E-Paper
Advertisement

Mahalakshmi Scheme : అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్!

Mahalakshmi Scheme : అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్!

మాట ఇచ్చామంటే.. చేసి తీరుతామని.. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ నిరూపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో రెండు పథకాలను అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్.

తొలుత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే చెప్పిన మాట నిలబెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో.. జీరో టికెట్లను ఆవిష్కరించి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ జెండా ఊపి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ పథకం ద్వారా ఇకపై తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ, బాలికలు, యువతులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు చూపించిన మహిళలకు జీరో టికెట్ ఇస్తారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. అంతర్‌ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

కాగా.. ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారు స్థానికతకు సంబంధించిన ఆధార్‌, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పలు గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుంది. త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్‌కార్డ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీకి రోజువారీ ఆదాయంలో సుమారు సగానికి తగ్గనుండగా.. ఆ మొత్తాన్నీ ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు చెల్లించనుంది. అనంతరం బాక్సర్ నిఖత్ జరీన్ కు ప్రభుత్వం తరపున రూ.2 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×