E-Paper
Advertisement

Guntur Karam Movie : గుంటూరు కారంలో సడన్ ట్విస్ట్.. త్రివిక్రమ్ లెక్క తప్పుతుందా..

Guntur Karam Movie : గుంటూరు కారంలో సడన్ ట్విస్ట్.. త్రివిక్రమ్ లెక్క తప్పుతుందా..
Advertisement
Guntur Karam Movie

Guntur Karam Movie : సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి.. అయితే చుక్కలన్ని ఒకవైపు చంద్రుడు మాత్రమే ఒకవైపు అన్నట్టు ఉంది గుంటూరు కారం పరిస్థితి. ఈ మూవీ కి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫాన్స్ దాన్ని క్రేజీగా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఎప్పుడూ లేనంత మాస్ గెటప్ లో దంచేస్తున్నాడు. మూవీ నుంచి వచ్చిన మంచి మసాలా సాంగ్ కూడా ప్రేక్షకులలో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ,మహేష్ బాబు కాంబోలో ముచ్చటగా వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఎంత ఘాటుగా ఉంటాయో.. మహేష్ బాబు చెప్పే స్టైల్ అంతకంటే ఘాటుగా ఉంటుందట. షూటింగ్ చివరి దశలో ఉండడంతో చిత్ర బృందం వీలైనంత త్వరగా పాటలు కంప్లీట్ చేసి షూటింగ్ కు ప్యాకప్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తుండగా ..సెకండ్ లీడ్ లో మీనాక్షి చౌదరి కనిపించబోతోంది.

Advertisement

గుంటూరు ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో మిర్చి యార్డ్ కాంబినేషన్లో.. ఫుల్ మాస్ కమర్షియల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 12న రాబోతోంది. ఇంకా గట్టిగా నెల కూడా టైం లేదు.. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో పక్క పెండింగ్ ఉన్న షూటింగ్ ని కంప్లీట్ చేయడంలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక సాంగ్ కేరళలో షూటింగ్ చేయాల్సి ఉంది.. కానీ సమయం తక్కువగా ఉన్న కారణంతో సాంగ్ కేరళలో లైవ్ లొకేషన్స్ లో చేయలేక అదే వాతావరణాన్ని సెట్ రూపంలో వేస్తున్నారట.

అందుకే ఈ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఫిక్స్ అయింది. పెండింగ్ ఉన్న ఈ సాంగ్ ని వీలైనంత వేగంగా పూర్తి చేయడంపై ప్రస్తుతం త్రివిక్రమ్ తన ఫోకస్ పెట్టారట. ఇక ఈ 30 రోజుల్లో ఔట్ పుట్ రెడీ చేయడంతో పాటు రిలీజ్ కాపీని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఉండనే ఉన్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో అనుకున్న టైంకి సినిమా రెడీ అవుతుందా అన్న సందేహాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. మామూలుగా సినిమా రిలీజ్ విషయంలో ఎప్పుడూ పక్క ప్లానింగ్ తో ఉండే త్రివిక్రమ్ గుంటూరు కారం విషయంలో కాస్త లెక్క తప్పడేమో అనిపిస్తుంది. కానీ త్రివిక్రమ్ పట్టుదల చూస్తే సినిమా అనుకున్న డేటు కే విడుదల అయ్యేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×