E-Paper
Advertisement

కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!
Advertisement

Mahesh Kumar Goud: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండొద్దని హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయాన కేసీఆర్ కుమార్తె కవితనే చెప్పారని పేర్కొన్నారు. తాము ఏ రోజు కేసీఆర్ చెడు కోరుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి చెడును కోరుకోదని స్పష్టం చేశారు.

గతంలో కేసీఆర్ బాత్రూమ్ లో జారి పడితే గ్రీన్ ఛానల్ ద్వారా సీఎం రేవంత్ వైద్యం చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం గురించి సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కోరుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ అన్నారు. ప్రతిపక్ష నేతను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుందని తేల్చి చెప్పారు.

Advertisement

Also Read: మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

55 మంది సిబ్బందితో కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ప్రభుత్వం సెక్యూరిటీని ఏర్పాటు చేసిందని టీపీసీసీ చీఫ్ తెలియజేశారు. అయితే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా టీపీసీసీ చీఫ్ స్పందించారు. వీర్లపల్లి శంకర్.. రేవంత్ రెడ్డి అభిమాని అని గుర్తుచేశారు. సీఎంపై ఉన్న అభిమానంతో వీర్లపల్ల అలా మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మరోమారు టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. దళిత సమాజాన్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడారని మండిపడ్డారు.

Advertisement

Also Read: అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

Tags

Related News

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన.. కేసీఆర్ చావు కోరుకున్నారు.. గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

మగ పోలీసులు తోసేశారు.. కిందపడితే తొక్కేశారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆవేదన

అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

కరెంట్ కష్టాలకు చెక్.. తెలంగాణకే 90 శాతం బొగ్గు.. సింగరేణి బంపరాఫర్!

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

Big Stories

Advertisement
×