E-Paper
Advertisement

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!
Advertisement

అనుకోకుండా జరిగే ఓ చిన్న పొరపాటు మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చేలా చేస్తుంది. అప్పటిదాకా ఎవరూ ఊహించరు. ఏదో అనుకోకుండా, అన్యపదేశంగా జరిగిన ఓ సంఘటన.. ఓ మాట మొత్తం సీన్ రివర్స్ అయ్యేలా చేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రెండు పార్టీల్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

దీని వల్ల ఉన్నపళంగా ఆ రెండు పార్టీల కొంపలేమీ మునగలేదు కానీ, ఇజ్జత్‌ పోయింది. జనం ముందు నవ్వులపాలయ్యారు. నేటి రాజకీయాలపై ఓ మచ్చలా జనం దీన్ని చూస్తున్నారు. పైగా.. ఈ రెండు పార్టీల నేతలు వీరిని కాపాడుకునే క్రమంలో, తమ రాజకీయాలను సమర్థించుకునే ఎపిసోడ్‌లో మరింత అభాసుపాలై.. కొత్త రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.

Advertisement

యథారాజా తథా ప్రజా అంటారు. తమ నేతలు ఎలా ఆలోచిస్తున్నారో.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలో.. వారిని ఖుషీ చేసి పదవులు పొందేందుకు ఎలాంటి యుక్తులు పన్నాలో వారికి అర్థమైపోతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ నేతల నుంచి అలాంటి అలవోక మాటలు నోరుజారి, ఆ నేతల వ్యక్తిత్వాలను, ఆ రాజకీయాలను పాతాళంలోకి పడేయాస్తాయనే సోయి ఉండదు. జనం ఏమనుకుంటారోనని సంస్కారమూ అప్పుడు పనిచేయదు.

ఎవరిది పై చేయిగా నిలిచింది? ఎంత రచ్చ చేశాం..? అనేదే ప్రధాన పాయింట్‌గా ఇరు పార్టీలు తీసుకోవడమే ఇప్పుడు అసలైన సమస్యగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు .. స్పీకర్‌ గాడు.. ఎవడాడు లం..కొడుకు మమ్మల్ని ఆపడానికి..? అంటూ బాహాటంగానే అసెంబ్లీ ముందు నడిరోడ్డుపై చిందులేశాడు. దీన్ని కేటీఆర్‌, కేసీఆర్, హరీశ్‌.. అంతా సమర్థించుకున్నారు. అలా అనలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. ఒకవేళ.. స్పీకర్‌ బాధపడి ఉంటే.. చింతిస్తున్నాం.. విచారిస్తున్నాం.. అంటూ లైట్‌ తీసుకున్నారు.

Advertisement

ఇక ఇదే ఊపులో రేవంత్‌ మనసు గెలుచుకునేందుకు వేముల వీరేశం.. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వద్ద చావు డప్పు కొడతామని ప్రకటించాడు. అన్నట్టుగానే హంగామా చేశారు  కాంగ్రెస్ నేతలు.  ఉద్రిక్తతకు దారి తీసేలా చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌నుద్దేశించి అలా మాట్లాడటం బీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టమే చేసింది. దీనిపై కాంగ్రెస్‌ ఎంత చేయాలో అంత చేసింది. అక్కడితే దీనికి ముగింపు పలకకుండా వేముల వీరేశం లాంటి నేతలను రంగంలోకి దింపి రణరంగం చేయడం ద్వారా కాంగ్రెస్‌ కావాలనే చేసే చీప్ రాజకీయ ఎత్తుగడగా జనం దీన్ని చూశారు.

దీనికి తోడు వీర్ల శంకర్.. మేము కేసీఆర్‌ చావు కోరుతున్నామని దిగజారి కామెంట్‌ చేశాడు. దీన్ని కూడా కాంగ్రెస్‌ సమర్థించుకున్నది. ఏదో బాధలో అని ఉంటాడు.. అని ఏకంగా టీపీసీసీ చీఫే మాట్లాడటం .. ఇలాంటి రాజకీయాలను అగ్రనేతలే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఫామ్‌హౌజ్‌ను ముట్టడించాలని పసుపు నీళ్లతో సంప్రోక్షన పేరుతో కొందరు బీఆర్ఎస్‌ నేతలు అతి చేసి అభాసుపాలయ్యారు. ఇదంతా కేసీఆర్, కేటీఆర్‌ మెప్పుకోసమేనని వేరే చెప్పక్కర్లేదు. వీటిని ఆదిలోనే కంట్రోల్‌ చేయకపోతే, పెంచి పోషించినట్టు వ్యవహరిస్తే.. ఇద్దరి కొంపలు ముంచుతాయి. పర్యవసానాలు రెండు పార్టీలు అనుభవించాల్సే ఉంటుంది.

Tags

Related News

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

అసెంబ్లీ వద్ద రచ్చకెక్కిన 22ఏ భూ దందా వివాదం..!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

Big Stories

Advertisement
×