E-Paper
Advertisement

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన.. కేసీఆర్ చావు కోరుకున్నారు.. గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన.. కేసీఆర్ చావు కోరుకున్నారు.. గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!
Advertisement

KTR Allegations: తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లిన కేటీఆర్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతు భీమా, 2 లక్షల ఉద్యోగాల కల్పన హమీ ఎగవేత వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

నిరసన సమయంలో రాహుల్ గాంధీ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లే.. తాము కూడా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా నల్ల టీ షర్ట్ ధరించినట్లు కేటీఆర్ తెలిపారు. కానీ తమని సభలోకి అడుగు పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారన్నారు. దాడి చేయడమే కాకుండా ఉల్టా తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును కోరుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వేముల వీరేశం, కుంభం అనిల్ రెడ్డి , నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారని.. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫామ్ హౌస్ పై దాడి చేసేందుకు ఉసిగోల్పారని కేటీఆర్ ఆరోపించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద చావు డప్పు కొట్టారని మండిపడ్డారు. తాము అనని మాటలను అన్నట్టు స్పీకర్ కు ఆపాదించారని పేర్కొన్నారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ ను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

మరోవైపు రాష్ట్ర శాసన సభను దుశ్సాసన సభగా మార్చేశారని కేటీఆర్ ఆరోపించారు. కాగా అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై తాము చేసిన ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీని పిలిపించి.. ఈ ఘటనపై మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ తరహా అప్రజాస్వామిక ఘటనలు మంచివి కాదని గవర్నర్ సైతం అభిప్రాయపడ్డారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Also Read: SIR తర్వాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి

Tags

Related News

కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

మగ పోలీసులు తోసేశారు.. కిందపడితే తొక్కేశారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆవేదన

అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

కరెంట్ కష్టాలకు చెక్.. తెలంగాణకే 90 శాతం బొగ్గు.. సింగరేణి బంపరాఫర్!

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

Big Stories

Advertisement
×