E-Paper
Advertisement

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!
Advertisement

Telangana Politics: గతంలో ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే భావజాలాల మధ్య చర్చ, సిద్ధాంతాల వైరుధ్యం, పార్టీ విధానాల్లో వ్యత్సాసం వంటి అంశాలపై మాత్రమే పోరాటాలు జరిగేవి. కానీ ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన చట్టసభలు.. రాజకీయ వేదికలు వ్యక్తిగత విమర్శలు, బూతులు, హుందాతనం లేని ప్రవర్తనలకు నిలయాలుగా మారుతున్నాయనే విమర్శలు మొదలయ్యాయి. పాలిటిక్స్ లో వ్యక్తిగత ద్వేషం పెరిగిపోవడంతో నేతలు తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక చట్టసభల స్థాయిని దిగజారుస్తున్నారనే చర్చ మొదలైది. ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలు, పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడుల యత్నాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.

విశ్వసనీయతకు దెబ్బ

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ దాకా ఏ అసెంబ్లీలో చూసినా ‘మైక్ కట్ చేశారనో’, ‘సభను నడవనివ్వరనో’ రచ్చ చేయడం నేతలకు పరిపాటిగా మారింది. సభా నియమావళిని విస్మరించి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం, తోపులాటలకు దిగడం, వాడకూడని పదజాలాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. ఈ నేతల ఈ దురుసు ప్రవర్తనలను ప్రజలు ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తున్నారన్న కనీస స్పృహ కూడా కొందరిలో కొరవడుతోందనే విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మేధావుల ప్లాట్ ఫామ్ లపై వినిపిస్తున్నాయి.

​ప్రజల మధ్య విద్వేషాల

Advertisement

​రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం నేతలు చేసే వ్యాఖ్యలు సమాజంలో తీవ్రమైన విద్వేషాలను క్రియేట్ చేస్తున్నాయి. ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ప్రసంగాలు ఇస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించడానికి శ్రుతిమించిన వ్యాఖ్యలు చేయడం, ఎదుటివారి కులాన్ని, క్యారెక్టర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం నిత్యకృత్యమైంది. నాయకులు చల్లే విద్వేషాల విత్తనాలు సాధారణ ప్రజల మధ్య గొడవలకు దారితీస్తున్నాయి.ఈ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ ప్లాట్ ఫామ్ లపై కూడా కనిపిస్తోంది.

బలవుతున్న కార్యకర్తలు

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వైరుధ్యం రాజకీయ విమర్శలు నుంచి వ్యక్తిగతంగా ఫైట్ చేసే స్థాయికి వెళ్లిపోయాయి. అయితే అగ్రనేతలు మాత్రం ఏసీ రూముల్లో, ప్రెస్ మీట్లలో పరస్పరం విమర్శలు చేసుకుని, బయటకు రాగానే సాధారణంగానే ఉంటారు. కానీ, వారి భావోద్వేగ ప్రసంగాలను నిజమని నమ్మే క్షేత్రస్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు రోడ్లెక్కి కొట్టుకుంటున్నారు. కేసులు ఎదుర్కొంటూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పైన ఉన్న నాయకులు ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్స్ లో చివరకు బలవుతోంది మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే. అధినాయకుల ప్రయోజనాల కోసం కిందిస్థాయి వారు బలిపశువులుగా మారుతున్నారు.

కాంగ్రెస్ నేతలు సైతం..

Advertisement

​తెలంగాణతో పాటు అధికారంలో ఉన్నామనే ధైర్యంతో కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా నిత్యం నోరు జారుతున్నారు. నాయకుల బాహాట వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తనలు ఆపార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెడుతున్నాయి. పార్టీ నియమావళిని దాటి, సొంత నిర్ణయాలు తీసుకోవడం, బహిరంగంగా అంతర్గత విభేదాలు బయటపెట్టుకోవడం, ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో స్వయంకృత అపరాధ వ్యాఖ్యలు చేయడం పార్టీ మైలేజీని దెబ్బతీస్తోంది. అధిష్టానం హెచ్చరిస్తున్నప్పటికీ, కొందరు నేతలు తమ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేక చేసే వ్యాఖ్యలను సరిదిద్దుకోవడానికే అధినేతలకు సగం సమయం సరిపోతోంది. పార్టీ ముఖ్య నేతలు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా..విమర్శల సందర్భాల్లో నేతలు అదుపుతప్పడం గమనార్హం.

తాజా ఎపిసోడ్..

ఇటీవల ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సాక్షిగా జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేశాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ MLC తాతా మధు అసభ్య పదజాలంతో దూషించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. స్పీకర్ పీఠం గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడారని అధికార పక్షం ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో స్పీకర్ కన్నీటి పర్యంతమవ్వడం, అనంతరం ఎంఎల్ సీ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం వంటి పరిస్థితులు వచ్చాయి. అంతేగాక బీఆర్ ఎస్ కూడా తమ మహిళా సభ్యులను అవమానించరంటూ ఆరోపణలు చేస్తూ ధర్నాలు, ఆందోళనలు చేపట్టింది.

జిల్లాల నుంచి గ్రామాల వరకూ..

ఏకంగా అసెంబ్లీ వద్ద ప్రతిపక్ష కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఇతర నేతలు పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ వివాదం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల మారుమూల గ్రామాల వరకు చేరింది. ప్రతీ చోటా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అనే స్థాయిలో గ్రౌండ్ లీడర్లు కొట్టుకుంటున్నారు. ఇటీవల మాజీ మంత్రి కొండా సురేఖ డాటర్ చేసిన వ్యక్తిగత విమర్శలు మరువకముందే స్పీకర్ పై విమర్శలు వచ్చాయి. అంతేకాక షాద్ నగర్ ఎమ్మెల్యే మాజీ ప్రతిపక్ష నేత చావాలి, ఆయన రాష్​ట్రానికి భట్టిన దరిద్రం అంటూ ఓ కామెంట్ చేశారు. ఈ కామెంట్ రెండు పార్టీ లీడర్ల మధ్య మరింత విధ్వేషాన్ని రెచ్చకొట్టింది.

రోడ్లెక్కి కొట్టుకునే స్థాయికి..

మరోవైపు పెద్ద నేతలు టీవీ డిబేట్లలో, సభల్లో హద్దులు దాటి మాట్లాడే మాటలు క్షేత్రస్థాయికి వెళ్లేసరికి పెద్ద విధ్వేషాలుగా మారుతున్నాయి. ప్రాంతాలు, కులాలు, మతాలను వేరు చేస్తూ నాయకులు విసిరే వ్యాఖ్యలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. మరోవైపు నేతల పిలుపులు, భావోద్వేగాల ప్రసంగాల ప్రభావంతో రోడ్లెక్కి కొట్టుకునే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చివరకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

Also Read: Ninnu kori Serial Today Episode September 9th ‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్‌కు ప్లాస్టిక్‌ సర్జరీ – ఒంటరిగా ఇంటికి వెళ్లిన చంద్ర

రాజకీయాల్లో దూకుడు ఓకే.. కానీ!

కానీ నేతలు చట్టసభలు, టీవీల్లో సేఫ్ గానే ఉంటున్నా.. క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం జైళ్లపాలవుతున్నారు. వాస్తవానికి ‘రాజకీయాల్లో దూకుడు ఉండొచ్చు కానీ, దురహంకారం ఉండకూడదు. ఎమోషన్స్ ఉండొచ్చు కానీ, విచక్షణ విస్మరించకూడదు. నేతలు తమ వ్యక్తిగత అజెండాలను, భావోద్వేగాలను పక్కనబెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం దక్కుతుంది. కార్యకర్తలు కూడా నేతల మాటల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను గ్రహించి విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అంటూతెలంగాణకు చెందిన పొలిటికల్ సైన్స్ ప్రోఫెసర్ ఒకరు ఆఫ్​ ది రికార్డులో తెలిపారు.

Also Read: 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

Tags

Related News

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

అసెంబ్లీ వద్ద రచ్చకెక్కిన 22ఏ భూ దందా వివాదం..!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

Big Stories

Advertisement
×