Cat Purring: ఎక్కువ మంది అనుకున్నట్టు పిల్లి సంతోషంగా ఉన్నప్పుడే ఆ శబ్దం చేయదు. మనని నమ్మి దగ్గరకి చేరినప్పుడు, ఒంటి మీద నిమురుతున్నప్పుడు సంతోషంతో అలా చేస్తుంది. అయితే, పిల్లులు భయపడినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, పిల్లలను కనే సమయంలో, కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా అలాగే శబ్దం చేస్తాయి. అందుకే సైంటిస్టులు దీనిని కేవలం ఆనందానికి చిహ్నంగా కాకుండా, తమకి తాము ధైర్యం చెప్పుకోవడానికి లేదా ఇతరులకు కంఫర్ట్ ఇవ్వడానికి చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. పుట్టిన మొదటి రోజుల్లోనే పిల్లి పిల్లలు పాలు తాగుతూ ఈ శబ్దం చేస్తుంటాయి. చూపు, వినికిడి లేని ఆ చిన్న పిల్లలకు, ఆ బాడీ వైబ్రేషన్ ద్వారా అంతా మంచే జరుగుతోందనే భరోసా వాటి తల్లి ఇస్తుంది.
మనిషి చెవికి వినిపించే రేంజ్లో పిల్లి వైబ్రేషన్స్
పిల్లి గొంతులో ఉండే వోకల్ ఫోల్డ్స్ దగ్గర కొన్ని ప్రత్యేకమైన టిష్యూ ప్యాడ్స్ ఉంటాయి. గిటార్ తీగ ఎంత బరువుగా ఉంటే అంత లోతైన శబ్దం వస్తుందో, ఇవి కూడా అలాగే పనిచేస్తాయి. మెదడు నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందకపోయినా, కేవలం గాలి పీల్చి వదిలే సమయంలో ఆ కణజాలం ద్వారా ఈ శబ్దం వస్తుందని తేలింది. మనుషుల చెవులు సెకనుకు కనీసం 20 కంపనాలను మాత్రమే వినగలవు. పిల్లి చేసే ఈ శబ్దం కూడా సరిగ్గా అదే రేంజ్లో ఉండటం వల్లే, మనం దాన్ని చెవులతో వినడంతో పాటు వేళ్లతో తాకి అనుభూతి చెందగలుగుతాం.
పిల్లి బాడీ వైబ్రేషన్
కొన్నిసార్లు పిల్లులు చేసే ఈ శబ్దం వెనుక చిన్న కోరిక ఉంటుంది. పిల్లులకు ఆకలైనప్పుడు అవి చేసే శబ్దంలో సరిగ్గా చిన్నపిల్ల ఏడ్చినట్టే ఒక హై-పిచ్ సౌండ్ కలిసి ఉంటుంది. ఈ శబ్దం చాలా అర్జెంటుగా అనిపించేలా ఉంటుంది. దీన్ని విన్న ఎవరైనా సరే పిల్లి ఆకలితో ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
Also Read: అమిత్ షా మాస్టర్ ప్లాన్ వర్సెస్ ప్రతిపక్షాల ఓట్ బచావ్.. 5 రాష్ట్రాల పోరులో గెలిచేదెవరు?