E-Paper
Advertisement

ఆపరేషన్ ముస్కాన్ -12 సక్సెస్..  6,307 మంది చిన్నారులను కాపాడిన తెలంగాణ పోలీసులు!

ఆపరేషన్ ముస్కాన్ -12 సక్సెస్..  6,307 మంది చిన్నారులను కాపాడిన తెలంగాణ పోలీసులు!
Advertisement

Operation Muskaan-12: స్వేచ్ఛ బ్యూరో: బాల కార్మిక వ్యవస్థ.. బాలల అక్రమ రవాణాను అరికట్టటంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేశాయని మహిళా భద్రత విభాగం డీజీ చారు సిన్హా తెలిపారు.

5,737 మంది చిన్నారులు మళ్లీ అమ్మ ఒడికే..

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్‌డివిజన్ పోలీస్ బృందాల్లో 620 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఎస్‌ఓపీలు, చట్టాలపై శిక్షణ ఇచ్చి, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, నిర్మాణ ప్రదేశాలు, టీ దుకాణాలు వంటి బాల కార్మికులు ఎక్కువగా కనిపించే ప్రాంతాలను గుర్తించి తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్‌లో రక్షించిన 6,307 మంది చిన్నారుల్లో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 3,447 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 2,860 మంది ఇతర రాష్ట్రాలు, నేపాల్‌కు చెందినవారన్నారు. మొత్తం 5,041 మంది బాల కార్మికులు, ఒక బానిస కార్మికుడు, 647 మంది వీధి బాలలు, 43 మంది భిక్షాటన చేస్తున్న చిన్నారులు, 11 మంది ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులు, డ్రాప్‌ అవుట్లు, బాల్య వివాహాలు, అక్రమ దత్తత వంటి ఇతర విభాగాల్లో 563 మంది చిన్నారులను గుర్తించి రక్షించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా 1,705 కేసులు నమోదు చేసి, 1,710 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 1,989 మంది చిన్నారులను రక్షించారు. కార్మిక శాఖ 1,381 తనిఖీ నివేదికలు జారీ చేయగా, కనీస వేతనాల చట్టం కింద రూ.37.95 లక్షల జరిమానాలు విధించింది. రక్షించిన చిన్నారుల్లో 5,737 మందిని కుటుంబాలకు అప్పగించగా, 570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు.

హోటళ్లు, ఇటుక బట్టీలపై పోలీసుల ఉక్కుపాదం..

Advertisement

హోటళ్లు, దాబాలు, వీధి వ్యాపారాలు, నిర్మాణ రంగం, కిరాణా దుకాణాలు, ఆటోమొబైల్ రంగం, మాంసం దుకాణాలు, ఇటుక బట్టీలు, వెల్డింగ్ వర్క్‌ షాపులు, బేకరీలు, పాదరక్షల దుకాణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ షాపులతో పాటు పాఠశాల మానేసిన చిన్నారులను కూడా గుర్తించి రక్షించినట్టు డీజీ చారుసిన్హా తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనలో అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

Also Read: నగర చెరువులకు పూర్వ వైభవం.. హైడ్రా పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం!

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1నుండి వాటర్ ట్యాంకర్లు..?

అమిత్ షా మహా పాదయాత్రతో.. రాంచందర్ రావు కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణకు అమిత్ షా రాక.. హైదరాబాద్‌ పర్యటనకు షెడ్యూల్ ఖరారు!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని స్పాట్‌లో వ్యక్తి మృతి!

రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద.. హైడ్రా సంచలన కూల్చివేతలు!

ఎల్ నినో ఎఫెక్ట్.. మండుతున్న నిత్యావసరాల ధరలు..!

ఆరో తరగతి చదువుతున్న కూతురిపై.. సవతి తండ్రి లైంగిక దాడి!

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

Big Stories

Advertisement
×