Park Hyatt Hotel: వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులు నిత్యం ప్రజలను అలర్ట్ చేస్తుంటారు. అయినా సరే ప్రమాదాలు అనుకోకుండా జరుగుతుంటాయి. తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అదే హోటల్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ బస చేస్తోంది. దీంతో క్రికెట్ ప్రేమికులు కాసింత ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
సోమవారం ఉదయం హైదరాబాద్ సిటీలోని పార్క్ హయత్ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో హోటల్ అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ సమయంలో హోటల్‌లో ఉన్న టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అన్ని ఫోర్లకు వెళ్లారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని హోటల్ వర్గాలు తెలిపాయి. హోటల్‌లో ఫస్ట్ అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతో ఈ ఘటన జరిగిందన్నది ఫైర్ ఆఫీసర్ మాట. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వుందని తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆస్తి నష్టం బాగా జరిగినట్లు చెబుతున్నారు.
మరోవైపు ఘటన జరిగిన పార్క్‌హయత్ హోటల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్ క్రికెట్ టీమ్ బస చేస్తోంది. ప్రమాద సమయంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు 6వ అంతస్తులో ఉన్నారు. వెంటనే హోటల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ హోటల్‌లో ప్రమాదం జరగడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సన్ రైజర్ టీమ్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: దివాలా చట్టాలపై ఎన్సీఐబీఎల్ సెమినార్.. వాటిపై చర్చ
ఆటగాళ్లు అంతా సేఫ్‌గానే ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో నెలకొన్ని ఉత్కంఠకు తెరపడింది. హైదరాబాద్ వేదికగా శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ విజయంతో ఆటగాళ్లు ఫుల్‌ఖుషీగా ఉన్నారు. అంతలో ఈ ఘటన జరిగింది. అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి ఆస్తినష్టం ఎంత మేరా జరిగింది అనేది తెలియాల్సివుంది.
పార్క్ హయత్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ SRH ప్లేయర్స్
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో బస చేస్తున్న ఆటగాళ్లు
హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావడంతో భయాందోళనకు గురైన సిబ్బంది, అతిథులు
ప్రమాద సమయంలో 6వ అంతస్తులో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లు
వెంటనే హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయిన… https://t.co/fEXwwWOVZj pic.twitter.com/AGbac2fcAm
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025