BigTV English

CSK VS LSG: లక్నోతో బిగ్ ఫైట్… ఓడితే CSK ఇంటికే..ధోని బిగ్ స్కెచ్

CSK VS LSG:  లక్నోతో బిగ్ ఫైట్… ఓడితే CSK ఇంటికే..ధోని  బిగ్ స్కెచ్

CSK VS LSG:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. 30వ మ్యాచ్ లో భాగంగా.. ఇవాళ లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానున్న నేపథ్యంలో… ఇరు ప్లేయర్లు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకం కానుంది.


మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?

లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్… రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో మనం తిలకించవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ప్రతి మ్యాచ్ ఉచితంగానే జియో హాట్స్టార్ లో వస్తోంది. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు చూడవచ్చు.


లక్నో సూపర్ జీన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య గత రికార్డులు

లక్నో సూపర్ జీన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల రికార్డులు పరిశీలిస్తే..
ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఒక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా మూడు మ్యాచ్ల్లో లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. ఇక ఈ రెండు జట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ 217. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ సాధించిందే. లోయస్ట్ స్కోర్ 176.

ఓడితే చెన్నై ఇంటికే?

లక్నో సూపర్ జెంట్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ మ్యాచ్ ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్ ఆశలు మరింత జటిలం అవుతాయి. ఆరు మ్యాచ్లు అడిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్లో ఓడిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరన ఉంది. కాబట్టి ఇకనుంచి ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఇవాళ ఓడిపోతే… ఇంటికి వెళ్లడం ఖాయమని అంటున్నారు క్రీడా విశేషకులు.

 

లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ XII: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ XII: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరనా

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×