ఈ కార్యక్రమంలో వివధ రంగాలకు చెందిన వారికి బహిరంగ ఆహ్వానం పలికింది. విద్యార్ధులు, న్యాయరంగ నిపుణులు, పరిశ్రమకు చెందిన ఔత్సాహికులు విద్యాసంస్థలు, బ్యాంకింగ్ రంగం, ఆర్ధిక రంగానికి చెందిన ఎవరైనా ఆ సదస్సులో పాల్గొనవచ్చని, పేపర్లు సబ్‌మిట్ చేయవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. పేపర్లు సమర్పించిన తర్వాత వాటన్నిటిని పరిశీలించి బహుమతులు కూడా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ ప్రధానం చేయనున్నామని ప్రకటన ద్వారా వెల్లడించారు.
కాగా హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటిలో వరుసగా రెండవ రోజు ఎన్‌సీఐబీఎల్(NCIBL)సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు బిగ్ టీవి స్పాన్స్రర్‌గా నిర్వహించింది. నల్సార్ ఇండియన్ కార్పోరేట్ అఫైర్స్‌తో పాటు ఢిల్లీ, ఎల్ఎల్ఎమ్ విద్యార్ధులు ఈ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేశారు. మాజీ న్యాయమూర్తులు, అడ్వకేట్లు ఈ సెమినార్‌లో పాల్గొన్నారు.
Also Read: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల.. అంబేద్కర్ జయంతికి సీఎం రేవంత్ గిఫ్ట్
దివాలా తీసిన కంపెనీలను చట్టం ద్వారా ఎలా గట్టెక్కించాలనే అంశంపై చర్చలు జరిపినట్లు తెలిపారు అధికారులు. ఐబీసీ యాక్ట్ 2016 రాకముందు దివాలా తీసిన కంపెనీల నుండి.. అప్పును రాబట్టడం అనేది చాలా కష్టంగా ఉండేదని, దీనిని పూర్తి స్థాయిలో ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సెమినార్‌ను ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
చర్చించిన అంశాలు ఇవే..
1. ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ లాస్
2. క్రాస్ బోర్డర్ ఇన్‌సాల్వెన్సీ
3. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ అండ్ లిక్విడేషన్ ప్రాసెస్
4. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్‌సాల్వెన్సీ అండ్ రోల్ ఆఫ్ ఆర్క్స్
5. పర్శనల్ ఇన్ సాల్వెన్సీ
6. కార్పొరేట్ గవర్నెన్స్