E-Paper
Advertisement

Congress : ఫ్రస్ట్రేషన్‌లో వలస నేతలు.. సొంతగూటికి చేరేనా?

Congress : ఫ్రస్ట్రేషన్‌లో వలస నేతలు.. సొంతగూటికి చేరేనా?
Advertisement

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వలస ఎమ్మెల్యేలు రేవంత్ సర్కారు మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వీరంతా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఉన్నత పదవులను అనుభవించారు. పదేండ్ల తర్వాత గులాబీ పార్టీ అధికారానికి దూరం కావడంతో వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చెంతకు చేరారు.పదవులు ఆశించే వీరంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని గులాబీ నేతలు ఆరోపిస్తుండగా.. వీరు మాత్రం తమ నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పాలన, సంక్షమం నచ్చి హస్తం సర్కారుతో అంటకాగుతున్నట్టు పేర్కొంటున్నారు. పేరుకు వీరంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటున్నా.. కాంగ్రెస్ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తున్నారు.

బడా లీడర్ల అసహనం..

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కే కేశరరావు సైతం నాడు కేసీఆర్‌కు కీలక ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు. ఆమె కూతురు విజయకు హైదరాబాద్ మేయర్ స్థానాన్ని బీఆర్ఎస్ కట్టబెట్టింది. అయినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కేకే, ఆమె కూతురు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కేకేకు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పోస్టు ఉన్నది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సైతం అదే పోస్టు కొనసాగుతున్నది. వీరిని పెద్దగా పదవులు ఏమీ వరించలేదు. దీంతో బడా లీడర్లుగా పేరొందిన వీరు రేవంత్ సర్కారుపై అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్‌లో ఉన్నామంటూనే అధికార పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేలు సరే..

Advertisement

ఫిరాయింపులకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపగా.. తామంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, తమను అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సస్పెండ్ చేయలేదని స్పీకర్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిరాయింపులకు పాల్పడినట్టు సరైన ఆధారాలు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంతో పాటు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. అంత వరకు బాగానే ఉన్నా వీరికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పదవులు కట్టబెట్టలేదు. నామినేటెడ్ పోస్టులు సైతం ఇవ్వలేదు.బీఆర్ఎష్ నుంచి కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారు హోదా అనుభవిస్తున్న కేకే, పోచారం మాత్రం సర్కారు మీద గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

హైదరాబాద్‌కు డ్రైవర్‌లెస్ పాడ్ ట్రాన్సిట్ సిస్టమ్.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

Advertisement

ఈ క్రమంలోనే బాన్సువాడ నియోజకవర్గంలో సిద్ధవాగు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండటంపై పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులకు కాల్ చేస్తే ఎవరూ సమాధానం ఇవ్వడంలేదని, నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని..ఫలితంగా తన నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తి ఎప్పుడు అయ్యేనో అని అసహనం వ్యక్తంచేశారు.ప్రాజెక్టు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. పరోక్షంగా ఆయన రేవంత్ సర్కారులో పనులు జరగడం లేదని సంకేతాన్ని ప్రజలకు పంపారు. దీనికితోడు తనకు పార్టీలో ప్రయారిటీ దక్కడం లేదని, ప్రభుత్వ సలహాదారు పదవి కూడా కేవలం నామమాత్రంగా మిగిలిందని అందరికీ తెలిసేలా చేశారు. కేకే సైతం ఇదే అహసనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరితో పాటే మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం సొంతగూటికి చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×