E-Paper
Advertisement

సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్‌కు ఇంత డిమాండా? దేశంలో ఏ స్థానంలో నిలిచిందంటే?

సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్‌కు ఇంత డిమాండా? దేశంలో ఏ స్థానంలో నిలిచిందంటే?
Advertisement

Secunderabad–Visakhapatnam Vande Bharat: దేశంలో వేగవంతమైన, ఆధునిక రైలుగా గుర్తింపు తెచ్చుకున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గంలో నడిచే ఈ రైలు అత్యధిక డిమాండ్ ఉన్న రైళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మార్గంలో ఇప్పటి వరకు లక్షలాది మంది తమ రాకపోకలు కొనసాగించారు.

ఇప్పటి వరకు 48 లక్షల మంది ప్రయాణం

సౌత్ ఇండియాలోని ఈ మార్గం ద్వారా 48 లక్షల మందికి పైగా ప్రయాణించారు.  దేశవ్యాప్తంగా చూస్తే, న్యూఢిల్లీ–వారణాసి మార్గంలో ఇప్పటి వరకు ఎక్కువ మంది ప్రయాణించారు. ఈ రూట్‌ లో 73 లక్షలకు పైగా మంది రాకపోకలు కొనసాగించారు. అలాగే న్యూఢిల్లీ–శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మార్గంలో కూడా సుమారు 56 లక్షల మంది ప్రయాణించారు. ఆధ్యాత్మికత, పర్యాటక ప్రాంతాల్లో సర్వీసులు అందించే వందేభారత్ రైళ్లుకు ఎక్కువ డిమాండ్ లభిస్తోంది.

వందేభారత్ రైళ్లకు భారీ ప్రజాదరణ

Advertisement

భారతీయ రైల్వే తాజాగా నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌  రైళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. 2024-25లో 2.97 కోట్ల మంది ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించగా, 2025-26లో ఆ సంఖ్య సుమారు 3.98 కోట్లకు చేరింది. అంటే దాదాపు 34 శాతం పెరుగుదల కనిపించింది. ఈ లెక్కలు ప్రయాణికులు వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు సర్వీసులను ఎంతగా కోరుకుంటున్నారో చూపిస్తుంది.

ఇప్పటి వరకు 9 కోట్ల మంది ప్రయాణం

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1 లక్ష ట్రిప్పుల ద్వారా 9.1 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించాయి. 2019లో న్యూఢిల్లీ–వారణాసి మార్గంలో మొదట ప్రారంభమైన ఈ స్వదేశీ సెమీ హై స్పీడ్ రైలు, ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించింది.

Advertisement

ఇతర మార్గాల్లో కూడా మంచి స్పందన కనిపిస్తోంది. చెన్నై–మైసూరు మార్గంలో 36 లక్షలకు పైగా ప్రయాణికులు సేవలను వినియోగించారు. ఈ ట్రైన్ సేవలు పర్యాటక రంగానికి కూడా సహాయపడుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన, చారిత్రక, తీరప్రాంత ప్రాంతాలకు ప్రయాణించడం సులభమవుతోంది. ఈ రైళ్లతో స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.

అందుబాటులోకి వందేభారత్ స్లీపర్ రైళ్లు

ఇక ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ సర్వీసును కూడా ప్రారంభించింది. 2026 జనవరిలో ప్రారంభమైన ఈ సేవకు మొదటి మూడు నెలల్లోనే మంచి స్పందన వచ్చింది. 119 ట్రిప్పుల్లో 1.21 లక్షల మంది ప్రయాణించగా, దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇది రాత్రి ప్రయాణాలకు కూడా వందే భారత్ ట్రైన్లపై విశ్వాసం పెరుగుతున్నదని సూచిస్తుంది. మొత్తంగా వేగం, సౌకర్యం, ఆధునిక సదుపాయాలతో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ భారతీయ రైల్వేలో ఒక పెద్ద మార్పును తీసుకువచ్చింది. దేశంలోని ప్రధాన నగరాలు, పర్యాటక ప్రాంతాలు, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ సేవలను అందిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ సేవలు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

Read Also: హైదరాబాద్‌కు డ్రైవర్‌లెస్ పాడ్ ట్రాన్సిట్ సిస్టమ్.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×