E-Paper
Advertisement

Revanth Reddy: 20 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డే.. కేసీఆర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

Revanth Reddy: 20 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డే.. కేసీఆర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
Advertisement

Komatireddy Venkatreddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ఉప్పల్ – ఘట్కేసర్ ఫ్లై ఓపర్ పనులు పరిశీలించారు. ఆరేళ్లుగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. పనుల జాప్యంపై ఆర్ అండ్ బీ అధికారులపై సీరియస్ అయ్యారు. నెపాన్ని కాంట్రాక్టర్ల మీదికో, జీహెచ్ఎంసీ మీదికో నెట్టేయడం సరికాదని, ఎక్కువ సమయం వీటికే కేటాయించాలని మంత్రి ఫైర్ అయ్యారు.

అదే సందర్భంలో అక్కడి నుంచి కాంట్రాక్టర్ గాయత్రి కన్‌స్ట్రక్షన్ ఓనర్ సుబ్బిరాం రెడ్డి కొడుకు సందీప్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఫ్లై ఓవర్ పనుల కంటే ముందుగా కింద ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఫ్లై ఓవర్ పనుల కంటే ముందు కింద ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించగా.. అందుకు సందీప్ రెడ్డి అంగీకరించారు. ఆగస్టు 15 నుంచి మొదటగా ఉప్పల్ నుంచి నారపల్లి వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీటీ రోడ్డు పనులు పూర్తయితే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి.

Advertisement

సెప్టెంబర్ చివరినాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం టెండర్లు పిలవానలి మంత్రి ఆదేశించారు. నవంబర్ 1వ తేదీన అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని వివరించారు. మూడు నెలల్లో హైదరాబాద్ – విజయవాడ ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 175 కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జీ నిర్మించి సెల్ఫీలు దిగితే సరిపోతుందా? అని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.

తెలంగాణ అలా రాలేదు..

Advertisement

కేసీఆర్ లాంటి సన్నాసి వల్ల తెలంగాణ రాలేదని, తన లాంటి వాళ్లు పదవులకు రాజీనామా చేసినందుకే వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బిడ్డ జైలుకు పోయిందన్న ఫ్రస్ట్రేషన్‌లో కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ఆందోళనలకే ప్రాధాన్యత ఇచ్చారని, చర్చను పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో 65 గంటల్లో 45 గంటలు ప్రతిపక్షాలకే ఇచ్చామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత.. మంత్రి పదవి కోసమే గులాబీ గూటిలో చేరారని ఆరోపించారు.

Also Read: సెమీస్‌లో ఓడిన లక్ష్యసేన్.. కాంస్యంపై ఆశలు సజీవం

అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి

రాష్ట్రంలో 20 ఏళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అసెంబ్లీ స్థానాలు 175కు పెరిగే ఛాన్స్ ఉన్నదని, పెరిగితే అందులో తాము 135 సీట్లు గెలుచుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×