BigTV English

Viral Video: ఎస్కలేటర్‌పై పిల్లాడితో రీల్స్ అవసరమా.. కొంచెం అయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో..

Viral Video: ఎస్కలేటర్‌పై పిల్లాడితో రీల్స్ అవసరమా.. కొంచెం అయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో..

Viral Video: తరచూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవడం చూసి ఇంకా మరికొంత మంది కూడా వీడియోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో అందరిని ఆకర్షించాలని, ఒక్క రోజులో ఫేమస్ అయిపోవాలని కలలు కంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ప్రమాదాలను కూడా కొనితెచ్చుకుంటున్నారు. అయితే చాలా మంది చేసే వీడియోలు చూడడానికి ఆకట్టుకునేలా, వినోదాన్ని అందించేలా ఉంటే మరికొంత మంది మాత్రం ప్రమాదకరమైనవి చేస్తుంటారు. ప్రాణాలకు తెగించి మరి వీడియోలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.


పెద్దలు చేసే వీడియోల కంటే పిల్లలతో కలిసి వీడియోలు చేస్తే త్వరగా ఫేమస్ అవుతామని భావించి చిన్న పిల్లలతో వీడియోలు చేస్తున్నారు. ఈ తరుణంలో చాలా మంది మంచి వీడియోలు చేస్తున్నా కూడా మరికొంత మంది మాత్రం ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే తాజాగా కొంత మంది ఓ ఇద్దరు మహిళలు చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్కలేటర్ ఎక్కాలంటే చాలా మంది భయపడుతుంటారు. కానీ మరికొంత మంది మాత్రం ఆ ఎస్కలేటర్‌పైనే వినూత్న సాహసాలు చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేసి నెట్టింట విమర్శల పాలైన ఇద్దరు మహిళల వీడియో వైరల్ అవుతోంది.

ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లిన ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లవాడితో కలిసి ఎస్కలేటర్ ఎక్కారు. ఈ తరుణంలో రీల్స్ చేయాలని ప్రయత్నించారు. కానీ అది కాస్త వారిని ప్రమాదంలోకి నెట్టేసింది. ఎస్కలేటర్ ఎక్కుతున్న మహిళలు పిల్లవాడి రెండు చేతులను ఇద్దరు పట్టుకుని ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పిల్లవాడితో పాటు ఆ ఇద్దరు మహిళలు కూడా ఎస్కలేటర్ పై కింద పడిపోయారు. ఈ తరుణంలో రెండు మెట్లు కిందకు దిగుతూ పడిపోవడంతో గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


Related News

Video viral: ముంబై వరదల్లో హీరోగా మారిన స్పైడర్ మ్యాన్.. నీటిని మొత్తం తోడేశాడుగా.. వీడియో వైరల్

Dance video: చీరలో డ్యాన్స్ దుమ్ముదులిపేసింది భయ్యా.. హీరోయిన్ కూడా పనికిరాదు.. వీడియో వేరే లెవల్

Viral video: ఇవి వరద నీళ్లా.. స్విమ్మింగ్ పూలా..? ఎలా ఈత కొడుతున్నారో చూడండి, వీడియో వైరల్

Viral Video: అగ్నిపర్వతం బద్దలయ్యే క్షణాల ముందు.. ప్రియురాలికి లవ్ ప్రపోజ్, వీడియో వైరల్

Body Double: ట్రంప్‌ను కలిసింది పుతిన్ కాదా.. ఆయన డూపా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే?

UK Schools: ఇంగ్లాండ్‌లోని 30 స్కూళ్లను కొనేసిన చైనా.. డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఇదేనా?

Big Stories

×