Big Stories

Minister KomatiReddy | రహదారులపై కేసీఆర్ శ్రద్ధ చూపలేదు.. ఆ కార్యాలయాలు కూల్చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

Minister KomatiReddy | సీఎల్‌పీ కార్యాలయాల కోసం కొత్త భవనాలు నిర్మిస్తామని.. ఇప్పుడున్న కార్యాలయ భవనాలు కూల్చేస్తామని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు.

- Advertisement -

రోడ్లు, భవనాలు (ఆర్‌అండ్‌బీ) శాఖ మంత్రిగా సచివాలయంలో ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టగానే రహదారుల నిర్మాణానికి సంబంధించి మొత్తం 9 ఫైళ్లపై సంతకాలు చేశారు. వీటిలో ముషంపల్లి రహదారిని 4 లైన్‌లుగా చేయడం, నల్గొండ నుంచి ధర్మాపురం, దుడ్యాల, కొడంగల్ రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు ఉన్నాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఆయన రహదారుల మెరుగుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లుగా రహదారులపై శ్రద్ధ పెట్టలేదన్నారు. తెలంగాణలోని 14 రహదారులకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ సౌత్‌ను నేషనల్ హైవేగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్-విజయవాడ రహదారిని ఆరు లైన్లకు, కల్వకుర్తి-హైదరాబాద్ 4 లైన్‌ల కోసం నిధుల పరిమితి పెంచాలని అడుగుతామన్నారు.

ఈ 9 ఫైళ్లలో ఐదింటి అనుమతికి రేపు కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తానని చెప్పారు. ఎంపీ పదవికి తాను రేపు రాజీనామా చేస్తానని తెలిపారు. హైదరాబాద్ – విజయవాడ హైవేకి ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లోపే విజయవాడ చేరుకునేలా విస్తరిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.

హరీశ్‌రావుపై మండిపడిన కోమటిరెడ్డి
ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్‌ ఏం చేసిందని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రహదారుల మీద శ్రద్ధ పెట్టలేదన్నారు. కక్ష సాధింపు పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చెప్పారు. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News