E-Paper
Advertisement

ED Inquiry : ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ… నెక్ట్స్ ఎవరు?

ED Inquiry : ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ… నెక్ట్స్ ఎవరు?
Advertisement

ED Inquiry : చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాజకీయ నేతలే టార్గెట్ గా విచారణ కొనసాగిస్తోంది. రెండో విడత విచారణలో టీఆర్ఎస్ నేతలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ , ధర్మేంద్ర యాదవ్ , ఎమ్మెల్సీ ఎల్ . రమణను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇప్పుడు మరికొందరిపై ఫోకస్ పెట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్‌ను విచారిస్తున్నారు. ఈడీ నోటీసులు ఇవ్వడంతో హరీష్ హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. బ్యాంక్ స్టేట్ మెంట్ లతో విచారణకు హాజరయ్యారు.

నిందితులు విదేశాల్లో క్యాసినో ఆడేందుకు హవాలా మార్గంలో డబ్బును తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్‌ను విచారించిన అధికారులు వారిచ్చిన సమాచారం ఆధారంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. క్యాసినో కేసులో తొలివిడతలో టూర్ ఆపరేటర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. 3 నెలల క్రితం చాలామంది టూర్ ఆపరేటర్లను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పుడు ఈడీ ప్రశ్నిస్తున్న వారిలో టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. తలసాని పీఏ హరీష్ ఇచ్చే స్టేట్ మెంట్‌ ఈ కేసులో కీలకంగా మారనుంది.

Advertisement

ఈడీ రెండో విడత విచారణలో టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులే ఉన్నారు. ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఎక్కడ తమకు నోటీసులు అందుతాయో అన్న ఆందోళన చాలామంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×