BigTV English

Pakistan Army Chief Illegal Wealth : పాక్ ఆర్మీ ఛీఫ్ అక్రమ ఆస్థులు..బట్టబయలు చేసిన ఫ్యాక్ట్ ఫోకస్

Pakistan Army Chief Illegal Wealth : పాక్ ఆర్మీ ఛీఫ్ అక్రమ ఆస్థులు..బట్టబయలు చేసిన ఫ్యాక్ట్ ఫోకస్

Pakistan Army Chief Illegal Wealth : ఓ వైపు పాకిస్థాన్ అప్పుల కుప్పగా మారి.. నిత్యావసరాల కోసం అర్రులు చాస్తున్న సమయంలో ఆ దేశ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఆస్థులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఆయన పదవి నుంచి దిగిపోతున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం ఇప్పుడు పాకిస్థాన్‌లోనే కాకుండా మొత్తం ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందుతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా దీనిపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.


పాకిస్థాన్‌లో ప్రముఖమైన ఫ్యాక్ట్ ఫోకస్ అనే సంస్థ బజ్వా ఆస్థులపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఓ ప్రముఖ జర్నలిస్ట్ బజ్వా ఆస్తులు ఎలా అమాంతం పెరిగాయో లెక్కలతో, ఆధారాలతో కథనాల్లో వివరించారు. ఆరేళ్లల్లో బజ్వా ఆస్తులు ఊహించనంత రెట్టింపయ్యాయని.. వాటి మొత్తం విలువ 12.7 బిలియన్ పాకిస్థానీ రూపాయలు ఉంటుందని కథనం వెలువరించారు.

ఆస్తులను అమాంతం పెంచుకున్న బజ్వా..లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లో ప్రముఖ ప్లాజాలను, కమర్షియల్ ఎస్టేట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల పేరు మీద కళ్లుచెదిరే ఆస్థులను బినామీగా రిజిస్టర్ చేయించారని ఆరోపణ చేసింది ఫ్యాక్ట్ ఫోకస్ సంస్థ. 2015లో బజ్వా తన పేరుతో ఏ ఆస్థులు లేవని ప్రకటించింది. అయితే ఆ తరువాత సంవత్సం ఆమె ఆస్థుల విలువ రూ.220 కోట్లకు ఎలా చేరిందని ఫ్యాక్ట్ ఫోకస్ సంస్థ ప్రశ్నిస్తోంది. బజ్వా కుమారిడితో పెళ్లి సమయంలో ఏమీ లేని కోడలి ఆస్తి.. పెళ్లైన వారానికి రూ.127 కోట్లకు ఎలా పెరిగిందని కథనం ప్రచురించింది ఫ్యాక్ట్ ఫోకస్ సంస్థ. ఈ కథనం ఇంటర్నెట్‌లో వెలువడగానే..సదరు వెబ్‌సైట్‌ను వెంటనే బ్యాన్ చేయించింది పాక్ ప్రభుత్వం.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×