E-Paper
Advertisement

హైదరాబాద్‌లో గ్యాస్ కొరత.. సమస్యను తక్షణమే పరిష్కరించాలి, కేంద్రమంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ

హైదరాబాద్‌లో గ్యాస్ కొరత.. సమస్యను తక్షణమే పరిష్కరించాలి, కేంద్రమంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
Advertisement

Minister Uttam Kumar: ఇరాన్ యుద్ధం ప్రభావంపై మెల్లమెల్లగా రాష్ట్రాలపై పడుతోంది. గ్యాస్ కొరతతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

కేంద్ర పెట్రోలియం మంత్రికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖ

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌జీపీ గ్యాస్ కొరత , దానికి సంబంధించి పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీకి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షకుపైగా ఎల్‌పీజీ ఆధారిత ఆటోలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్‌పీజీ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

ఎల్పీజీ ఆధారిత ఆటోలకు గ్యాస్ కొరత వల్ల హైదరాబాద్ సిటీలో ప్రజల రవాణా ఇబ్బందులు తలెత్తినట్టు ప్రస్తావించారు. గ్యాస్ కొరత నేపథ్యంలో దీనిపై ఆధారపడిన వేలాది మంత్రి ఆటోడ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని వెల్లడించారు. తెలంగాణలో గ్యాస్ కొరతపై ఎప్పటికప్పుడు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

Advertisement

హైదరాబాద్‌లో గ్యాస్ కొరతపై లేఖలో ప్రస్తావన

సోమవారం ఎల్పీజీ సరఫరాదారులతో సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ప్రభుత్వ అధికారులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గ్యాస్‌ కొరత నివారణకు ప్రభుత్వరంగ సంస్థలు సరఫరాను పెంచాలని ఈ సమావేశంలో కోరారు. ఆటోలకు రోజువారీగా 202 టన్నుల గ్యాస్‌ అవసరం కాగా, ప్రస్తుతం 147 టన్నులు అందుబాటులో ఉంటోంది.

ఆటో ఎల్పీజీ సరఫరాలో 75 శాతం ప్రైవేటు సంస్థలదే. హైదరాబాద్‌లో మొత్తం 143 ఎల్‌పీజీ ఔట్‌లెట్లు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో 116, ఓఆర్‌ఆర్‌ లోపల-వెలుపల మరో 27 ఉన్నాయి. ప్రస్తుతానికి అందులో 23 పని చేయలేదు. వివిధ రాష్ట్రాల టర్మినళ్ల నుంచి బల్క్‌ ఎల్పీజీని సేకరిస్తునట్లు ఆ సమావేశంలో మంత్రి వెల్లడించిన విషయం తెల్సిందే.

ALSO READ: కాళ్లబేరానికొచ్చిన ‘పాడి కౌశిక్ రెడ్డి’.. అసలేమైంది?

 

Related News

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

Big Stories

Advertisement
×