E-Paper
Advertisement

Nagarkurnool : ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య.. నిందితుడు దొరికాడు ఇలా..!

Nagarkurnool : ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య.. నిందితుడు దొరికాడు ఇలా..!
Advertisement

Nagarkurnool : సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్లిన వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్‌కి చెందిన నాగమ్మ(60) అనే వృద్ధురాలుకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

కొడుకుల వద్ద ఉన్న ఆమె సంక్రాంతికి వంగూరు మండలం ఉల్పరలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లేందుకు మంగళవారం కల్వకుర్తికి వెళ్లింది. బస్సు కోసం బస్టాండులో వేచి ఉండగా గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను వెంట తీసుకెళ్లాడు. నాగమ్మ రాత్రయినా కుమార్తె ఇంటికి చేరుకోపోవడంతో మరుసటి రోజు అంతా వెతికినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు బుధవారం పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Advertisement

పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. అందులో నిక్షిప్తమైన దృశ్యాలతో నిందితున్ని గుర్తించారు. అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. అచ్చంపేట సమీపంలో నల్లమల అడవుల్లో మృతదేహాన్ని పడేసి గుర్తుపట్టకుండా నిప్పటించాడు.

పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి మరో కేసులోనూ నిందితునిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×