
MLA Prakash Goud : ఎన్నికల ప్రచారంతో ఓవైపు బిజీబిజీగా ఉన్న కేసీఆర్‌కు ప్రజల నుంచి అక్కడక్కడా వ్యతిరేకత ఎదురవుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో మంగళవారం ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజలు అడ్డుపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులు తమ ప్రాంతంలో ప్రచారం చేయడానికి వేల్లేదంటూ ప్రజలు అడ్డు తగిలారు. దీంతో అక్కడ ఉద్రక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్(MLA Prakash Goud)కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వర్గీయులకు మాత్రమే ఉచిత ఇళ్లు, దళిత బంధు పథకాలు ఇచ్చారంటూ ఆరోపించారు.
విప్రోలో భూములు కోల్పోయిన తమకు ఎటువంటి న్యాయం చేయలేదని.. అలాంటిది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రచారానికి వస్తున్నారని బీఆర్ఎస్ నాయకులను స్థానికులు నిలదీశారు.
దళితబంధు తమకు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామంలో పనులు మేమే చేసుకుంటాం. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇలాంటి ఘటనలే డోర్నకల్ ఎమ్మల్యే రెడ్యానాయక్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎదురయ్యాయి. వారు ప్రచారం కోసం వెళ్లినప్పుడు ప్రజలు ఇలాగే నిలదీశారు