
IND vs NZ Semi Final : ‘‘ఒరేయ్..నువ్వు లేచినప్పుడు రోహిత్ సిక్స్ కొట్టాడు. అలాగే నిలబడి ఉండు, కూర్చోకు..కూర్చుంటే నువ్వయిపోయినట్టే..’’
‘‘బావా..నువ్వు పడుకోకు..లే..నువ్వు పడుకుంటే వికెట్లు పడిపోతున్నాయి. ముందు లే..’’
‘‘ఈరోజు దేవుడి గుడికెళ్లి మన ఇండియా గెలవాలని ప్రార్థించాను. అందుకే గెలిచింది..’’
‘‘నేను ఉపవాసం ఉంటా..మనోళ్లు గెలుస్తారు చూడండి’’
‘‘మన కోహ్లీ సెంచరీ కొట్టాలిరా..అదే నా కోరిక..దానికోసం నడిచి తిరుపతి కొండెక్కుతాను..’’
‘‘ఇండియా గెలిచిందంటే 100 కొబ్బరి కాయలు కొడతాను స్వామీ’’
భారతీయులకి, సెంటిమెంట్స్ కి అవినావభావ సంబంధం ఉంది. భారతీయ మూలాల్లోనే సెంటిమెంట్స్ దాగున్నాయి. భారతీయులను వాటి నుంచి విడదీసి చూడలేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు క్రికెట్ లో అయితే, అది బాగా అంటుకుపోయింది. రేపటి ఇండియా-కివీస్ సెమీఫైనల్ మ్యాచ్ లో అయితే, అది పీక్స్ లో ఉంది.
సెమీస్ లోకి న్యూజిలాండ్ కాకుండా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వచ్చి ఉంటే బాగుండేదని కొందరంటున్నారు. ఎందుకంటే సెంటిమెంట్ పరంగా కివీస్ తో వర్కవుట్ కావడం లేదని అంటున్నారు. కాకపోతే లీగ్ దశలో ఓడించేసింది కాబట్టి, అదంతా కొట్టుకుపోయింది, డోంట్ వర్రీ అని కొందరంటున్నారు. ఇప్పుడు దశ ఇండియా వైపు తిరిగిందని చెబుతున్నారు.
అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే, ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ అలన్ కెటిల్ బరో ఈసారి సెమీస్ లో లేకపోవడమేనని చెబుతున్నారు. ఇది భారత్ కి కలిసివచ్చే అంశమే అంటున్నారు. టీమ్ ఇండియా నాకౌట్ మ్యాచ్ ల్లో ఓడిన ప్రతిమ్యాచ్ కి ఇతనే అంపైర్ గా ఉన్నాడు. ఇలా ఎన్నోరకాలుగా భారతీయులకి, సెంటిమెంట్స్ కి విడదీయరాని బంధం ఉంది.
మరొక విషయం ఏమిటంటే, అసలు రోహిత్ శర్మ కు వరల్డ్ కప్ ముద్దాడే యోగం ఉందా? అని జ్యోతిష్యాలు కూడా చూస్తున్నారు. అతని నక్షత్రం ప్రకారం తనకి అదృష్ట యోగం ఉందని పండితులు చెబుతున్నారు. అదృష్టం అంటే కప్ తెచ్చుకోవడమేనని కొందరంటున్నారు. మరి జాతకం ప్రకారం వరల్డ్ కప్ 2023 కొడతాడని రాసి ఉండదు కదా..అని వివరిస్తున్నారు.
కొందరు దేవాలయాల్లో పూజలకి రెడీ అవుతున్నారు. నిరంతరం ప్రార్థనలు చేస్తూనే ఉండాలని అభిమానులను కోరుతున్నారు. ఇండియన్స్ కష్టపడుతున్నారు..వారికి దైవబలం కూడా అవసరమని కొందరు నొక్కి వక్కానిస్తున్నారు. నేను వంద కొబ్బరికాయలు కొడతాను? మరి మీరు? అని కొందరు పోస్టింగులు పెడుతున్నారు. చూశారు కదండీ..అప్పుడే వేడి మొదలైంది.
KCR : దుబ్బాక అభ్యర్థిపై దాడి.. కేసీఆర్ వార్నింగ్ ఇదే..