BigTV English

MLC Kavitha Bail Petition Update: కవిత‌కు దక్కని ఊరట.. మళ్లీ మే ఆరుకు వాయిదా!

MLC Kavitha Bail Petition Update: కవిత‌కు దక్కని ఊరట.. మళ్లీ మే ఆరుకు వాయిదా!

MLC Kavitha Bail Petition Verdict Postponed to May 6th: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్ పిటీషన్లపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. మే ఆరున తీర్పు ఇస్తామని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ పిటీషన్లపై తుది ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై తీర్పు వస్తుందని చాలా ఆశగా ఎదురుచూశారు ఆ పార్టీ నేతలు. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.

కవిత బెయిల్ పిటీషన్లపై ఇదివరకే విచారణ చేపట్టింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి విన్నవించారు. అయితే సీబీఐ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది.


Also Read: T-congress Manifesto : తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు

ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌లో కవిత కీలకమైన వ్యక్తని సీబీఐ పేర్కొంది. బెయిల్‌పై ఈడీ, సీబీఐ, ఆమె తరపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే రెండున తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. తాజాగా న్యాయస్థానం వీటిపై తీర్పును మే 6కు వాయిదా వేసింది. ఈలెక్కన కవిత బెయిల్ వస్తుందా? లేక తీహార్ జైలుకేనా అన్న చర్చ బీఆర్ఎస్ నేతల్లో సాగుతోంది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×