Big Stories

T20 World Cup 2024: ఎవరి కోసం రింకూని బలి చేశారు..? ఇదో చెత్త సెలక్షన్: సీనియర్లు సీరియస్..!

Krishnamachari Srikanth on Rinku Singh’s Exclusion in T20 World Cup 2024: మొత్తానికి రింకూసింగ్ నెట్టింట పెద్ద పనే పెట్టాడు. తనని టీ 20 ప్రపంచకప్ కోసం కాకుండా ట్రావెల్ రిజర్వ్ ఆటగాడిగా పరిమితం చేయడం సరికాదని సీనియర్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మాజీ ఓపెనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇదొక చెత్త సెలక్షన్ అని ముఖమ్మీదే చెప్పాడు. సౌతాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ తో జరిగన మ్యాచ్ ల్లో జట్టుని ఒంటిచేత్తో ఆదుకున్న తనకి, మీరిచ్చే గౌరవం ఇదా? అని మండిపడ్డాడు.

- Advertisement -

176 స్ట్రయిక్ రేట్ తో 356 పరుగులు చేశాడు, ఇంతకన్నా ఏం కావాలని అన్నాడు. ఇలాంటి వాడిని ఎలా వదిలేస్తారని అన్నాడు. అవసరమైతే ఓపెనర్ గా పంపించాలని అన్నాడు. అందుకు అవసరమైతే యశస్విని తప్పించినా నష్టం లేదని అన్నాడు.

- Advertisement -

ఇంతవరకు రింకూ సింగ్ 15 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ లు ఆడాడు. అన్నింట కూడా బెస్ట్ ఫినిషర్ గా తన పాత్రని నిర్వర్తించాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ అయిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో తను వెలుగులోకి వచ్చాడు. ప్రపంచానికి పరిచయం  అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 2024లో 82 బంతులు ఆడి 150 స్ట్రయిక్ రేట్ తో 123 పరుగులు చేశాడు.

Also Read: దేశం కోసం ఆడే ఆటగాళ్లలో హార్దిక్ ఒకడు: గవాస్కర్

ఈ విషయంలో కోల్ కతా మేనేజ్మెంట్ పై కూడా తీవ్ర విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా ఆకాశ్ చోప్రా ఈ అంశాన్ని లేవనెత్తాడు. తను టీ 20 ప్రపంచకప్ లో ఎంపిక అవుతాడని తెలిసి, తనని గేమ్ లో ముందు పంపించి ఉంటే బాగుండేదని అన్నాడు. అది ధోనీ చేశాడని చెప్పుకొచ్చాడు. తను బ్రహ్మాండంగా ఆడుతూ కూడా శివమ్ దుబెని ముందు పంపించి, ఒక ఆటగాడి భవిష్యత్తుని కాపాడాడని అన్నాడు.
కెప్టెన్ అంటే ఇలా ఉండాలని అన్నాడు.

ఈ విషయంపై కోల్ కతా మేనేజ్మంట్ ని నిందించడం సరికాదని అంటున్నారు. ఎందుకంటే నిజంగా టీమ్ ఇండియా సెలక్షన్ కమిటీ అలా రింకూని పరీక్షించాలని భావిస్తే, ఇంటర్నల్ గా  ఆ జట్టుకి సందేశం ఇచ్చేదని, దేశ ప్రతిష్టను నిలబెట్టే విషయంలో బీసీసీఐ వెనుకడుగు వేయదని అంటున్నారు.  రింకూ విషయం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సెకండ్ థాట్ లేదని, నిజంగా తనని తీసుకుందామనే అనుకున్నారని అంటున్నారు. కానీ శివమ్ దుబె అద్భుతంగా ఆడి తనకి చెక్ పెట్టాడని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News