BigTV English

Krishnamma Trailer Released: ఎందుకు చస్తున్నామో తెలియకపోవడమే అసలైన బాధ.. ఆసక్తి రేపుతున్న కృష్ణమ్మ ట్రైలర్

Krishnamma Trailer Released: ఎందుకు చస్తున్నామో తెలియకపోవడమే అసలైన బాధ.. ఆసక్తి రేపుతున్న కృష్ణమ్మ ట్రైలర్

Satya Dev’s Krishnamma Movie Trailer Trailer Out: కుర్ర హీరో సత్యదేవ్, అర్చన జంటగా వివి గోపాల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కృష్ణమ్మ. అరుణమాల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సత్యదేవ్ తో పాటు కృష్ణ బురుగుల, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడంతో పాటు సినిమాపై హైప్ ను కూడా క్రియేట్ చేసాయి.


ఇక మే 3 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ గతరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి.. అందులోనే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కృష్ణమ్మ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సత్యదేవ్ ఊర మాస్ అవతార్.. యాక్షన్ సీక్వెన్స్ లో అతడు నట విశ్వరూపం చూపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక కథ విషయానికొస్తే.. భద్ర, కోటి, శివ.. ముగ్గురు చిన్నతనం నుంచి స్నేహితులు. ఊరు, పేరు తప్ప తల్లితండ్రి ఎవరు లేని అనాథలు. అయినా కూడా ముగ్గురు ఒకరికోసం ఒకరు అన్నట్లుగా బతుకుతూ ఉంటారు. అలా సాగుతున్న వీరి జీవితంలోకి కొన్ని సమస్యలు వస్తాయి. అసలు కేసు ఏంటో కూడా తెలియకుండా వీరి ముగ్గురును ఒక పెద్ద కేసులో ఇరికిస్తారు పోలీసులు. అనాథలు.. ఎవరికి చెప్పుకోలేరు.. ఏం చేయలేరు అని పోలీసులు ఒక పెద్ద కేసులో వీరిని జైలుకు పంపిస్తారు. అసలు కేసుకూడా ఏంటో తెలియకుండా ఆ ముగ్గురు జైలు జీవితం అనుభవిస్తూ తమను ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినవారిపై పగ తీర్చుకోవాలని జైలునుంచి బయటకు వచ్చి వేట మొదలుపెడతారు. అసలు ఆ కేసు ఏంటి.. ? ఎందుకు ఈ ముగ్గురును మాత్రమే కేసులో ఇరికించారు.. ? చివరికి కృష్ణమ్మ సాక్షిగా వీరికి న్యాయం జరిగిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Also Read: ఈ సారి అల్లరోడు అలరించాడా..?

అనాథలపై లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టడం పోలీసులకు మామూలు విషయమే. అయితే పుట్టుక తెలియకపోవడం బాధ అనుకుంటే.. ఎందుకు చస్తున్నామో.. ఎవరు చంపుతున్నారో తెలియకుండా చావటం మరింత బాధ అని సత్యదేవ్ చెప్పే ఒక్క డైలాగ్ తో సినిమా ప్లాట్ ను చెప్పేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సత్యదేవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×