BigTV English

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కొడుకులు చనిపోయిన గంటల వ్యవధిలోనే వారి తల్లులు సైతం గుండెపోటుతో మరణించారు. ప్రాంతాలు వేరైనా.. గుండెపోటుకు గురై నలుగురు మృతి చెందడంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గుండెపోటుతో తల్లీ, కొడుకు మృతి చెందారు. ఈ ఘటన హవేలి ఘనపుర్ మండలం కూచన్ పల్లిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. కొడుకు మరణవార్త విన్న తల్లి లక్ష్మి.. గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏపీలోని చిత్తూరు నగరంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చిత్తూరు నగరంలో కూమారుడు మరణించాడని తల్లి అవేదనతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కట్టమంచికి చెందిన సురేంద్రరెడ్డి(58) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు. కుమారుడుడిని అచేనంతగా చూసిన తల్లి సుశీలమ్మ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడి మృతి.. తట్టుకోలేక షాక్ గురై మరణించిందని డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరు తల్లులు, ఇద్దరు కొడుకుల మరణాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.


Related News

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Big Stories

×