BigTV English

Wristphone: ఇది వాచ్ కాదు ఫోన్.. దీని ఫీచర్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

Wristphone: ఇది వాచ్ కాదు ఫోన్.. దీని ఫీచర్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

Wristphone: మీరు ఓ మంచి ఫోన్ లాంటి వాచ్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. అతి త్వరలోనే అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి రాబోతోంది. ఫైర్ బోల్ట్ డ్రీమ్ (Fire-Boltt Dream) కంపెనీ త్వరలో భారతదేశంలో ఓ రిస్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మొదటి ఆండ్రాయిడ్ 4G LTE నానో-సిమ్ సపోర్ట్ చేసే ‘రిస్ట్‌ఫోన్’ ఇది అని కంపెనీ తెలిపింది. అంటే స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్ కలయిక అని అర్థం. పూర్తి వివరాల్లోకి వెళితే..


టెక్ సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ రిస్ట్ ఫోన్ దాదాపు అన్ని ఫంక్షన్లనూ స్మార్ట్‌ఫోన్ లాగా అమలు చేయగలదు. దీనితో, ఎటువంటి హెడ్‌సెట్‌నూ అటాచ్ చేయకుండా కూడా కాలింగ్ చేయవచ్చు. ఈ డివైజ్ Android OSలో రన్ అవుతుంది. OTT, గేమింగ్ అప్లికేషన్‌లకు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ రిస్ట్‌ఫోన్‌ను జనవరి 10న విడుదల కానుంది. అమెజాన్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ డివైజ్ ధరను కంపెనీ వెల్లడించలేదు.

ఫీచర్లు..


ఈ డివైజ్ 12 బ్యాండ్ ఆప్షన్లతో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో Mali-T820 MP1 GPU, 2GB RAM, 16GB స్టోరేజ్‌తో కూడిన క్వాడ్-కోర్ ఆర్మ్ కార్టెక్స్ A7MP ప్రాసెసర్‌ని కూడా అమర్చారు. 800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇతర వాచ్‌ల మాదిరిగానే.. ప్రీ-లోడ్ చేసిన స్పోర్ట్స్ మోడ్‌లు, హృదయ స్పందన రేటు, SpO2 సెన్సార్లు, క్యాలరీ మానిటర్‌లను కలిగి ఉంటుంది. GPS, WiFi, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు 4G LTE నానో SIM స్లాట్‌ను కూడా కలిగి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంటుంది. వినియోగదారులు Gmail, Instagram, WhatsApp, Zomato, Spotify వంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే JioCinema, Netflix, Amazon Prime వీడియో వంటి యాప్‌లు కూడా ఈ రిస్ట్‌ఫోన్‌లో రన్ అవుతాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×