BigTV English

Magnesium Deficiency : కండరాల నొప్పులా?.. జాగ్రత్త సుమీ..

Magnesium Deficiency : కండరాల నొప్పులా?.. జాగ్రత్త సుమీ..
magnesium deficiency

Magnesium Deficiency : మన శరీరానికి కావాల్సిన అత్యంత కీలకమైన మినరల్ మెగ్నీషియం. జీవక్రియ సజావుగా సాగేందుకు అది ఎంతో ముఖ్యం. మెగ్నీషియం తగ్గడం వల్ల కండరాలు నొప్పులు ఉంటాయి. ఒక్కోసారి పట్టేస్తాయి కూడా. వాటి వ్యాకోచసంకోచాలకు కావాల్సింది మెగ్నీషియమే. ఈ మినరల్ తగినంత స్థాయిలో లేకపోతే కాళ్లు, పొత్తికడుపు సహా శరీరమంతటా నొప్పులే.


మెగ్నీషియం డెఫిషియన్సీ కారణంగా అలసట ఉంటుంది. ఈ మినరల్ లోపిస్తే హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గుల రిస్క్ తప్పదు. అంతిమంగా ఇది గుండెసంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మెగ్నీషియం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఈ మినరల్ ముఖ్యం. న్యూరోట్రాన్స్‌మిటర్లను నియంత్రించడంలో దీని పాత్ర కీలకం.

శరీరంలో మెగ్నీషియం స్థాయులు తగ్గితే మానసిక ఆరోగ్యం లోపిస్తుంది. ఎముకలు పటిష్ఠతకూ ఇది ముఖ్యమే. మెగ్నీషియం లెవల్స్ తగ్గడం వల్ల ఎముకలు సాంద్రత కోల్పోతాయి. ఫలితంగా ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఉంటుంది. ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం, విటమిన్-డి తో పాటు మెగ్నీషియం కూడా కావాలి.


వివిధ హార్మన్లను కూడా ఇది నియంత్రిస్తుంటుంది. మెగ్నీషియం లోపిస్తే అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఉంటాయి. ఈ లోపం ఉన్నవారు దుంపబచ్చలి, క్వినోవా, గోధుమ, బాదం, జీడిపప్పు, వేరుశనగ, అవకడో, బ్లాక్‌బీన్స్ ఎక్కువగా ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×