BigTV English

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Congress : మూసీలో మూడు రోజులు ఉండమంటే, బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మూసీ ఒడ్డున ఉండేవారికి మంచి బతుకు ఇవ్వాలని తాము ప్రయత్నిస్తుంటే, ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే కవితకు బెయిల్ వచ్చిందా? అంటూ సెటైర్లు వేశారు. హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు. 24 గంటలపాటు ట్వీట్లు చేస్తేనో, సినిమా వాళ్లతో సంబంధాలు ఉంటేనో నాలెడ్జ్ ఉన్నట్టు కాదు డ్రామారావు అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు చామల. కేటీఆర్ ఆన్‌లైన్, బీఆర్ఎస్ ఆఫ్‌లైన్, కేసీఆర్ ఫ్లైట్ మోడ్ అంటూ చురకలంటించారు. పొద్దున బావ హరీష్ రావు మధ్యాహ్నం బావమరిది కేటీఆర్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ALSO READ:ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!


హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానని మాయమాటలు చెప్పింది ఎవరో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ లాగా, రేవంత్ రెడ్డి మాయమాటలు మాట్లాడటం లేదని చెప్పారు. లక్షన్నర కోట్లు అనే పదాన్ని పట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, పది నెలల కాంగ్రెస్ పాలనకు మధ్య యుద్ధం జరుగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి మూసీకి పునరుజ్జీవం తీసుకురావాలని చూస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించిన చామల, పేదలు మురికి కూపంలోనే బతకాలా అని ప్రశ్నించారు.

భువనగిరి ప్రజలకు మూసీ జీవ నది అని పేర్కొన్నారు. మూసీ నీళ్ల వలన మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదని, ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్, బీజేపీ అభిప్రాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీని వ్యతిరేకించే నాయకుల లాగు ఉడబీకుతామన, రోడ్లమీద తిరగనియ్యమని, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు, ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మూసీ ప్రక్షాళన అవసరం లేదంటే అక్కడ ఉండి ఆ నీళ్లతో స్నానం చేయాలన్నారు. వాసన రాకుంటే ప్రక్షాళన అవసరం లేదని చెప్పారు. ఈటల బీజేపీలోకి పోయి కలుషితం అయ్యారని, పాత బాస్‌లు కేసీఆర్, కేటీఆర్‌లను ఆయన అనుసరిస్తున్నారని మండిపడ్డారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×