BigTV English

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

MP Eatela Rajender Writes to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ లేఖ రాశారు. ఆ లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రా సంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీని కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేలా చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు కూడా పక్షులు, చేపలకు నిలయంలా లేదు. వాటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుంది. చుట్టుపక్కల ప్రజల రోగాలకు నిలయమైంది. ముందు ఈ చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి. అది చేయకుండా 40 ఏళ్ళక్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లే అవుట్ లలో ఇల్లు కట్టుకున్న నిరుపేదప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ మీరు చేస్తున్న అడ్డగోలు కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాం. బాధితులు గొల్లున ఏడుస్తున్నా, కాళ్లమీద పడ్డా.. వదిలిపెట్డడడంలేదు. వారు కడుపుకాలి మాట్లాడుతున్నారు. వారికి డబ్బులు ఇస్తే సరిపోదు. పేదల చిరకాల స్వప్నం ఇళ్లు. దొంగలలాగా దాడి చేసి మీరు చేస్తున్న కూల్చివేతలు, ఇస్తున్న నోటీసులు ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. మీకేమీ అపరిమిత అధికారాలు లేవు అని గుర్తుచేస్తున్నా.


Also Read: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే మేం అడ్డుకోం. పట్టాభూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్ వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకొని ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గం. పిడికెడు అక్రమ ఇళ్లను బూచీగా చూపి రూ. కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొడుతున్నారు. RB-X అని రాస్తున్నారు. పనిగిరి కాలనీ, మారుతీనగర్, చైతన్య పురి, ప్రజయ్ ఇంజనీరింగ్ సిండికేట్ లాంటి అపార్ట్మెంట్స్ అన్నీ తిరిగివచ్చాం. మేం ప్రజల మధ్య ఉన్నాం. మీకు తిరిగి చూసే టైం లేదు. తిరిగి చూసి.. వారి ఆక్రందనాలను ఆవిష్కరించే మమ్ముల్ని కాలకేయులుగా పోలుస్తున్నారు. ఇదేనా మీ భాష మీ సంస్కారం.?


బ్యూటిఫికేశన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డీపీఆర్ ఉందా? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? రూ. కోట్లవిలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమోగంగా ప్రాజెక్టుకు 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి.

Also Read: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేస్తారు?. పట్టా భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారో చెప్పండి. మీరు చేస్తున్న పనులు హైదరాబాద్ భవిష్యత్తుని, అభివృద్ధిని ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి. స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా.. నిర్ణయాధికారం ఉన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. నా కొట్లాట రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న పేదల ఇళ్ళకోసమే. మీరు లక్షన్నర రూ. కోట్లు పెట్టే ఖర్చు పేదల కోసమేనా ? అంత బడ్జెట్ మతలబు ఏంటో తేలాల్సిఉంది. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు నా ప్రతిఘటన ఉంటుంది. పదవి ఉన్నా లేకున్నా నేను ప్రజల పక్షాన ఉండేవాడిని అని తెలంగాణ సమాజానికి తెలుసు’ అంటూ ఈటల ఆ లేఖలో పేర్కొన్నారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×