E-Paper
Advertisement

రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.. అభివృద్ధిపై ఎంపీ ధీమా!

రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.. అభివృద్ధిపై ఎంపీ ధీమా!
Advertisement

Musi Rejuvenation: స్వేచ్ఛ బ్యూరో: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న తీరుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా బీజేపీ నాయకుడు రామచందర్ రావు కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

అభివృద్ధిపై విమర్శలు తగవు

Advertisement

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి, దేవాలయాల నిర్మాణం వంటివన్నీ ప్రభుత్వ బడ్జెట్‌తోనే జరుగుతాయనే కనీస అవగాహన రామచందర్ రావుకు ఉండాలని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం యాదాద్రిని నిర్మించింది కూడా ప్రజా ధనంతోనే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.

బీజేపీ – బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఎంపీ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, మీడియాలో కనిపించాలనే తాపత్రయంతోనే రామచందర్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

నగరాభివృద్ధికి ఆటంకం

మూసీ నది ప్రక్షాళన ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం భావిస్తుంటే, దానికి అడ్డుతగలడం అంటే నగర అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయం కోసం ప్రాజెక్టులను అడ్డుకోవడం మానుకొని, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×