E-Paper
Advertisement

Nalgonda Mp ticket : నల్గొండ ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ .. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం ఎటు?

Nalgonda Mp ticket : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ వేడి మొదలైంది. నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొనగా.. తిరిగి ఏప్రిల్- మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలవాలని గెలుపు గుర్రాల వేటలో తలమునకలయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ కాంగ్రెస్ నేతలు.. ఎంపీ టికెట్ పై గురి పెట్టారు. ఎలాగైనా పార్టీ తరఫున బరిలో నిలవాలనుకుంటున్నారు. ఇందుకోసం ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు.

Nalgonda Mp ticket : నల్గొండ ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ .. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం ఎటు?
Advertisement

Nalgonda Mp ticket : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ వేడి మొదలైంది. నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొనగా.. తిరిగి ఏప్రిల్- మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలవాలని గెలుపు గుర్రాల వేటలో తలమునకలయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ కాంగ్రెస్ నేతలు.. ఎంపీ టికెట్ పై గురి పెట్టారు. ఎలాగైనా పార్టీ తరఫున బరిలో నిలవాలనుకుంటున్నారు. ఇందుకోసం ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు.

రాష్ట్రంలో అధికారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే గెలిచే నేతలకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం నాయకులు అపుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలో నల్గొండ ఎంపీ స్థానం నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

Advertisement

నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. అయితే ఈ ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం సైతం గట్టి అభ్యర్థుల వెదుకులాటలో ఉంది. గతంలో పార్టీ నాయకత్వం ఇచ్చిన రాతపూర్వక హామీపై పటేల్ రమేష్ రెడ్డి భరోసాతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి సైతం నల్గొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

శాసనసభ ఎన్నికల సమయంలోనే రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరని కారణంగా రఘువీర్ రెడ్డిని పక్కన పెట్టి మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆయన రెండో తనయుడు కుందూరు జై వీర్ రెడ్డి కి టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ హామీ ఇచ్చినందు వల్లనే ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నారనే ప్రచారం ఉంది .

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకున్న సమయంలోనే వస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుందన్న విశ్వాసంతో పలువురు నేతలు ఉన్నారు. దీంతో ఎంపీ టికెట్ కోసం పోటీ పెరిగిందంటున్నారు రాజకీయ నిపుణులు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఒక్క సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన అన్ని సెగ్మెంట్లలో శాసనసభ ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. స్వల్ప కాల తేడాతో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇది విజయానికి దోహదపడుతుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది.

కుందూరు రఘువీర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకరు దగ్గరి అనుచరుడు, మరొకరు సన్నిహిత మిత్రుడు కావడంతో పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? ఎవరిని నల్గొండ ఎంపీ టికెట్ వరిస్తుంది..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరితో రఘువీర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధిష్టానం ఎవరిని గుర్తించి ఎవరి మెడలో దండ వేస్తుందో వేచి చూడాలి మరి.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×