BigTV English

Ambati Rayudu : అందుకే వైసీపీకి రాజీనామా.. అంబటి రాయుడు ట్వీట్..

Ambati Rayudu : అధికార వైసీపీకి మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు రాజీనామా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరగాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అంబటి రాయుడు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వివరణ ఇచ్చారు. జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని అంబడి రాయుడు తెలిపారు. వృత్తిపరమైన కీడ్రను ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

Ambati Rayudu : అందుకే వైసీపీకి రాజీనామా.. అంబటి రాయుడు ట్వీట్..

Ambati Rayudu : అధికార వైసీపీకి మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు రాజీనామా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరిగాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అంబటి రాయుడు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వివరణ ఇచ్చారు. జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని అంబడి రాయుడు తెలిపారు. వృత్తిపరమైన కీడ్రను ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు.


గుంటూరు ఎంపీ టికెట్‌ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా జగన్‌ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనికి అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలిసింది. అయితే రాయుడు గుంటూరు స్థానాన్ని ఆశించినట్లు సమాచారం. దీంతో టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×