Big Stories

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ!

Arrest Warrant issued against to Prabhakar Rao Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది. సీఆర్పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు అనుమతివ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్న నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో ఉన్న ఆ నలుగురు వెల్లడించిన వివరాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.

- Advertisement -

Also Read: CM Revanth Reddy: ‘మోదీ, అమిత్ షా సంక్రాంతి గంగిరెద్దుల్లా రాష్ట్రానికి వస్తున్నారు’

ఈ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ బీఐ మాజీ చీఫ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు పారిపోయారు. ప్రభాకర్ రావు ఏ ఎయిర్ పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన్ను పట్టుకునే క్రమంలో రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్ పోల్ అధికారులను దర్యాప్తు బృదం సంప్రదించాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 73 సెక్షన్ ద్వారా పోలీసులు కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News