Big Stories

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు భారీ షాక్ ఇచ్చిన కోర్టు..

phone tapping case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు నాంపల్లి కోర్టులో ఇటీవలె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై 24న తేదీని కోర్టులో వాదనలు ముగిశాయి. కాగా, కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

అయితే ఈ కేసులో నిందితుల వాదనతో ఏకీభవించని కోర్టు.. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈకేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని పోలీసులు కోర్టులో వెల్లడించారు. సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. దీంతో ఇరువురి వాదనలు విన్న కోర్టు వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

Also Read: సెమీ ఫైనల్లో గెలిచాం.. ఇక ఫైనల్లో గెలవాలి..

ప్రస్తుతం కేసు విచారణ కీలక దశలో ఉందని పోలీసులు కోర్టులో వెల్లడించారు. అయితే ఈ కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు కూడా బెయిల్ కోరుతో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News