Big Stories

Nitish Kumar Reddy: మా పక్కింటి ఆంటీ వల్ల క్రికెటర్‌ను అయ్యా: నితీశ్ కుమార్ రెడ్డి

Nitish Kumar Reddy: హైదరాబాద్ జట్టులో విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ము దుమారం రేపుతున్నాడు. ఈ సందర్భంగా అంబటి రాయుడుతో జరిగిన ముఖాముఖిలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అవిప్పుడు నెట్టింట మంచి ట్రెండింగులో ఉన్నాయి. ఇంతకీ అంబటి రాయుడు ఏం అడిగాడంటే…నీకు క్రికెట్ అంటే ఎందుకు ఇంట్రస్ట్ ఏర్పడింది? క్రికెటర్ కావాలని ఎలా అనుకున్నావ్? అన్న ప్రశ్నకు నితిన్ తన చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పాడు.

- Advertisement -

మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయి. ఆయన మంచి కబడ్డీ ప్లేయర్ కూడా… ఆయన ప్రతి సండే గ్రౌండ్ కి వెళుతుంటారు. స్కూల్ నుంచి వచ్చి, ప్రతిరోజు నేను వీధిలో క్రికెట్ ఆడేవాడిని. నేను కొట్టే బాల్స్ వెళ్లి పక్కింట్లో పడేవి. వారి అద్దాలు పగిలిపోవడం, లేదా మొక్కల కుండీలు పడిపోవడం లాంటివి జరిగేవి. అంతేకాదు బాల్ కోసం మేం గోడ దూకి వెళ్లి, అక్కడంతా తొక్కి పారేసే వాళ్లం. దాంతో ఆ ఇల్లుగల ఆంటీకి కోపం వచ్చి మా అమ్మతో గొడవ పడేది. రోజూ ఆ న్యూసెన్స్ ఎక్కువైపోయింది.

- Advertisement -

అప్పుడే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. నేను ఉదయం లేస్తే సాయంత్రం వరకు వీధిలోనే క్రికెట్ ఆడతానని భావించిన మా అమ్మ, ఆంటీ బాధ పడలేక, మీతో పాటు వీడిని కూడా గ్రౌండ్ కి తీసుకుపోయి, ఏదొకటి నేర్పించండి అని చెప్పింది. దాంతో మా డాడీ ఆలోచించి సరే అని గ్రౌండ్ కి తీసుకువెళ్లారు. అక్కడ నేను క్రికెట్ క్యాంప్ లో చేరాను.

నేను బాగా ఆడటం చూసిన మా కోచ్, మా డాడీ వద్దకు వచ్చి క్రికెట్ నేర్పించండి, మంచి ప్లేయర్ అవుతాడని చెప్పడంతో ఆయన బాగా ఆలోచించి సరేనని కోచింగ్ కి పంపారు. అలా మొదలై, ఇప్పుడీ స్థాయికి వచ్చానని తెలిపాడు. ఈ విషయం విన్న అంబటి రాయుడు ఒకటే నవ్వు నవ్వి, అంటే, చాలామందిలా ఒక యాంబిషన్ తో క్రికెట్ లోకి రాలేదన్నమాట అన్నాడు.

Also Read: ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా ఉన్నట్టేనా?

అయితే ఇప్పుడు ఆంటీకి థ్యాంక్స్ చెప్పావా? మరి అని అడిగాడు. చాలాసార్లు అని నితిన్ నవ్వుతూ చెప్పాడు. మొత్తానికి సరదాగా సాగిన ఆ సంభాషణ నేడు నట్టింట మంచి ట్రెండింగులో నడుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News