E-Paper
Advertisement

Congress : కేబినెట్ మంత్రులకు కొత్త టెన్షన్?

Congress : కేబినెట్ మంత్రులకు కొత్త టెన్షన్?
Advertisement

రాష్ట్ర మంత్రులకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా.. ఈనెల చివరలో సెషన్స్ ముగుస్తాయి. అనంతరం మంత్రి వర్గ విస్తరణ లేదా ప్రక్షాళన? ఉంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి.దీనికి తోడు ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పలువురు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్‌తో పాటు అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది.ఈ క్రమంలోనే ఒకరిద్దరు మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి చోటిస్తారని తెలుస్తున్నది. మరోవైపు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ భవితవ్యంపైనా గందరగోళం నెలకొన్నది.

ఇన్ ఎవరు? ఔట్ ఎవరు?

కేబినెట్ విస్తరణ, ప్రక్షాళన? ఉంటుందని తెలియగానే కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీ లెవల్లో జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గత రెండు విస్తరణలో చివరివరకూ వచ్చి మిస్ అయిన వారంతా ఇప్పుడు ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.దీనికి తోడు సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న అజారుద్దీన్ చట్టసభలకు ఇంకా ఎంపిక కాలేదు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన్ను నామినేట్ చేసి మంత్రిగా చాన్స్ సీఎం రేవంత్ చాన్స్ ఇచ్చారు.కానీ, గవర్నర్ ఇంకా ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయలేదు. ఇప్పికే మూడు నెలలు గడిచిపోయాయి.ఆరు నెలల్లోపు ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ కాకపోతే ఆయన మంత్రి పదవి పోవడం ఖాయంగా తెలుస్తోంది.

వారికి పదవులు దక్కేనా?

Advertisement

ఇక ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్న ఒకాయన పనితీరుపై సీఎం రేవంత్‌తో పాటు అధిష్టానం సైతం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి, మరో మహిళా మంత్రి పనితీరుపై అధిష్టానం నారాజ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కొందరు సీనియర్లు పట్టుబట్టుకుని కూర్చున్నారు. చైర్మన్ పదవులు ఇచ్చినా తమకు అవసరం లేదని మొహంమీదే చెప్పేస్తున్నారు. వారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒకరు. గతంలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించినా.. సామాజిక వర్గం పరంగా ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి దక్కింది. ఇకకాంగ్రెస్ సీనియర్ సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోరగా.. ఆయనకు కేబినెట్ హోదాతో కూడిన ప్రభుత్వ సలహాదారుగా సీఎం అపాయింట్ చేశారు.

CPI Protest: పేదలకు ఇళ్లు ఇచ్చేవరకు ప్రభుత్వమే ఇంటి అద్దెను చెల్లించాలి.. సిపిఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య

Advertisement

చాలా మందే తమకు మంత్రి ఇవ్వాలని లాబీయింగ్ చేస్తుండగా.. ఎక్కడ తమ పదవులు పోతాయో? అని ఇప్పుడు కేబినెట్‌లో ఉన్న మంత్రులు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. పదవి పోయి వారి జాబితాలో తాను ఉన్నానా?? లేదా? అని సీఎంవో లెవల్లోపైరవీలు చేస్తున్నారట.. ఈ ఒక్కసారి చాన్స్ ఇవ్వాలని ఢిల్లీ హైకమాండ్ వద్ద మొరపెట్టుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం వద్ద మున్సిపల్, విద్యా, హోంశాఖలు ఉన్నాయి. మరో ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకుంటే విద్యా, మున్సిపల్ శాఖలు చెరొకటి చొప్పున కేటాయించే అవకాశం ఉన్నది. హోంశాఖ మాత్రం సీఎం వద్దే ఉంటుందని తెలుస్తున్నది. మొత్తంగా కేబినెట్ విస్తరణ ఏమో కానీ, ప్రక్షాళన పేరు వింటే కొందరు మంత్రలు భయపడుతున్నట్టు సమాచారం.

 

 

 

 

 

 

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×