Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: ఇచ్చిన హామీ ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమ్మె కాలంలో నిలిపివేసిన వేతనాన్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగుల పక్షాన తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ..
పలువురు ఎన్ఎహెచ్ఎం ఉద్యోగ సంఘం జేఎసీ అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సోమవారం కలిసి వినతి పత్రం అందించారు. తమ సమస్యలను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా బండి మాట్లాడుతూ.. ఎన్ హెచ్ఎంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, జీవో నంబర్ 60ను అమలు చేయడంతోపాటు జీవో 1195 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
90 రోజుల హామీ ఏమైంది?
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. స్పర్శ్ విధానం ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. అలాగే ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఎన్ హెచ్ఎం ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రయోజనాలను కల్పించాలని రాష్టవ్ర ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా సమ్మె కాలానికి పూర్తి వేతనాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఈ హామీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, 90 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందునే వీరు సమ్మెను విరమించారని బండి సంజయ్ గుర్తుచేశారు.
Also Read: తెలంగాణలో ఆల్-టైమ్ రికార్డు విద్యుత్ డిమాండ్.. రబీ సీజన్‌పై భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు