E-Paper
Advertisement

ఇండియాలోకి నార్టన్ న్యూ బైక్.. 585cc ఇంజిన్‌తో రాబోతున్నఅట్లాస్!

ఇండియాలోకి నార్టన్ న్యూ బైక్.. 585cc ఇంజిన్‌తో రాబోతున్నఅట్లాస్!
Advertisement

Norton Atlas Patented: ప్రీమియం బైక్స్ తయారీ సంస్థ నార్టన్ (Norton) భారత మార్కెట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మ్యాంక్స్ ఆర్ (Manx R) బైక్ కు పేటెంట్ పొందిన ఈ సంస్థ.. తాజాగా తన కొత్త అడ్వెంచర్ బైక్ అట్లాస్ (Atlas)కు కూడా భారత్‌లో పేటెంట్ దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో యూకే మార్కెట్లో పరిచయమైన ఈ బైక్ త్వరలోనే భారత్ లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాస్‌తో పాటు రోడ్ రైడింగ్‌కు అనువైన అట్లాస్ జీటీ (Atlas GT) మోడల్‌ను కూడా తీసుకురానుంది.

585cc ఇంజిన్.. 70hp పవర్..

నార్టన్ అట్లాస్‌ లో 585cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. ఇది 9,300rpm వద్ద 70hp గరిష్ట పవర్‌ను, 7,300rpm వద్ద 57.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ కు లింక చేశారు.  రైడింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు బై-డైరెక్షనల్ క్విక్‌ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్‌ను స్టాండర్డ్‌ గా అందించారు. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై రూపొందించిన ఈ బైక్‌లో కాస్ట్ అల్యూమినియం స్వింగ్‌ ఆర్మ్ ఉంది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో పూర్తిగా అడ్జస్ట్ చేసుకునే USD ఫోర్కులు, వెనుకవైపు రిమోట్ ప్రీలోడ్ అడ్జస్టర్‌తో కూడిన మోనోషాక్ ఇచ్చారు. ఈ రెండింటినీ KYB సంస్థ తయారు చేసింది.

Atlas, Atlas GT మధ్య తేడాలేంటి?

Advertisement

నార్టన్ అట్లాస్‌ ను రెండు వేరియంట్లలో అందిస్తోంది. వీటిలో అట్లాస్ అడ్వెంచర్ రైడింగ్‌కు అనుకూలంగా ఉండగా, అట్లాస్ జీటీ రోడ్లపై ప్రయాణించేందుకు రూపొందించారు. అట్లాస్‌లో 19 అంగుళాల ఫ్రంట్ వీల్ ఉండగా, అట్లాస్ జీటీలో 17 అంగుళాల ఫ్రంట్ వీల్ ఇచ్చారు. అట్లాస్ సీట్ హైట్ 845mmగా ఉంది. అదే జీటీలో 815mm మాత్రమే ఉంటుంది. అడ్వెంచర్ వెర్షన్‌లో ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్ అందించారు. దీంతో ఆఫ్‌రోడ్ ప్రయాణాలను ఇష్టపడేవారికి అట్లాస్ అనుకూలంగా ఉండనుంది.

అధునాతన ఫీచర్లు.. 8 అంగుళాల టచ్‌ స్క్రీన్

ఈ రెండు బైక్‌లలోనూ కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, వివిధ రైడింగ్ మోడ్‌లు లాంటి ఫీచర్లు అందించారు. మ్యాంక్స్ ఆర్‌లో మాదిరిగానే 8 అంగుళాల టచ్‌ స్క్రీన్ TFT డిస్‌ ప్లే కూడా ఉంటుంది.

భారత్‌ లో ఎప్పుడు విడుదలవుతుంది?

Advertisement

నార్టన్ అట్లాస్, అట్లాస్ జీటీ  బైక్ లను భారత లోని టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా పేటెంట్ లభించడం భారత్‌ లో వీటి విడుదలకు సంబంధించిన ప్లాన్స్ ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే, కంపెనీ ఇప్పటి వరకు అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. యూకేలో అట్లాస్ ప్రారంభ ధర 8,250 పౌండ్లు (సుమారు రూ.10.22 లక్షలు) ఉంటుంది. భారత్‌లో స్థానికంగా తయారవుతుండటంతో తక్కువ  ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 750 లాంటి అడ్వెంచర్ బైక్‌లకు ఇది పోటీ ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Read Also: కంపెనీ చెప్పేది 526 కి.మీ.. రియల్ టెస్ట్‌ లో వచ్చింది ఎంతంటే?

Tags

Related News

Kia Syros EV Range: కంపెనీ చెప్పేది 526 కి.మీ.. రియల్ టెస్ట్‌ లో వచ్చింది ఎంతంటే?

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. ఇప్పుడు ఎంత అంటే?

కారు కీని గుర్తించడం లేదా? బ్యాటరీ అయిపోయినా ఇలా స్టార్ట్ చేయొచ్చు!

LFP vs NMC బ్యాటరీలు.. ఇండియన్ ఈవీలకు ఏది బెస్ట్? అసలు తేడాలు ఇవే!

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

కారు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారుతున్నాయా? వేలల్లో నష్టాన్ని తప్పించుకోండిలా!

కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Big Stories

Advertisement
×