Yellamma Movie:పుష్కర కాలానికి పైగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ మెప్పిస్తున్న జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇందులో కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న వేణు ఎల్దండి (Venu y) ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా నటించి మెప్పించారు . అలాంటి ఈయన దర్శకుడిగా మారి చేసిన చిత్రం బలగం. కావ్య కళ్యాణ్ రామ్, ప్రియదర్శి వంటి నటులతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అంతేకాదు తొలి ప్రయత్నం లోనే సక్సెస్ లభించడంతో అందరి దృష్టి ఆయన తదుపరి చిత్రంపై పడింది.
అలా ఊహించని అంచనాలతో.. బలగం సినిమా అందించిన క్రేజ్ తో ‘ఎల్లమ్మ’ అనే ఒక పవర్ఫుల్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వేణు. పైగా ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం మొదట నాని , నితిన్ లను అనుకున్నారు. కానీ చివరికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన దేవిశ్రీ.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండడం గమనార్హం. పైగా ఈ సినిమాలో పర్షి అనే పాత్రలో కనిపించబోతున్నారు. కథకు తగ్గట్టుగానే దేవిశ్రీని ఎంచుకున్నట్లు వేణు ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అంటూ కొన్ని వార్తలు రాగా తాజాగా ఒక పేరు తెరపైకి వచ్చింది.
ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో వెంకన్న పాత్రతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న చైతు జొన్నలగడ్డను (Chaith jonnalagadda) ఎల్లమ్మ సినిమాలో విలన్ పాత్రకు ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజానికి తెలంగాణ యాసపై చైతు జొన్నలగడ్డకు మంచి పట్టు ఉంది. దీనికి తోడు చైతు జొన్నలగడ్డ నటన కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నేపథ్యంలోనే ఎల్లమ్మ సినిమాలో విలన్ పాత్ర కోసం ఈయనను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చైతు జొన్నలగడ్డ విషయానికి వస్తే.. రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో వెంకన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం ధనుష్ హీరోగా , శ్రీ లీల హీరోయిన్గా, సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఓం అనే చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు . అలాగే దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతిహాసన్, గౌతమ్ వాసుదేవ్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో కూడా మంచి పాత్ర పోషిస్తున్నారు. పైగా ఈ రెండు చిత్రాలు కూడా ఈ వారం విడుదలవుతున్నాయి. ఇక రాజు వెడ్స్ రాంబాయి లాంటి తెలంగాణ రూరల్ స్టోరీలో నెగిటివ్ షేడ్ లో మెప్పించి ప్రస్తుతం ఇన్ని ఆఫర్స్ తెచ్చుకున్న చైతు జొన్నలగడ్డ ను ఎల్లమ్మ సినిమాలో ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఎల్లమ్మ కూడా పడితే ఈయన కెరియర్ ఇంకా పీక్స్ లోకి వెళ్తుంది అనడంలో సందేహం లేదు.
also read:నైజాంలో కల్కి2 ధర ఎన్ని కోట్లో తెలుసా? ఎవరు దక్కించుకున్నారంటే?
ఒకవైపు తమ్ముడు హీరోగా దూసుకుపోతుంటే.. ఇటు అన్న విలన్ గా మరింత దూసుకుపోతున్నారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి ఏదిఏమైనా సిద్ధూ జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ ఇప్పుడు మంచి పాత్రలను దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.