E-Paper
Advertisement

Fire Accident : ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 14 గంటలపాటు జాతీయ రహదారిపై అగ్నికీలలు

Fire Accident : ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 14 గంటలపాటు జాతీయ రహదారిపై అగ్నికీలలు
Advertisement

Fire Accident : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం శివారులో 63వ జాతీయ రహదారిపై ఇంధన ట్యాంకరు బోల్తాపడటంతో చెలరేగిన మంటలు 14 గంటలపాటు అదుపులోకి రాకపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేట పెట్రోల్‌ బంకుకు డీజిల్‌, పెట్రోల్‌ తీసుకొస్తున్న లారీ మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు వెంకట్రావుపేట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవరు వెంటనే బయటకు రాగా.. ఒక్కసారిగా ఇంధన ట్యాంకరు నుంచి మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పలుమార్లు రసాయనాలతో కూడిన నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాద సమయానికి ట్యాంకరులో 18 వేల లీటర్ల డీజిల్‌, 4 వేల లీటర్ల పెట్రోల్‌ ఉన్నట్లు సమాచారం. దీంతో నిజామాబాద్‌ డివిజనల్‌ అగ్నిమాపక అధికారి మురళీమనోహర్‌రెడ్డి, అసిస్టెంట్‌ అధికారి భానుప్రతాప్‌, జగిత్యాల జిల్లా ఫైర్‌ అధికారి కొమురయ్య, మెట్‌పల్లి అగ్నిమాపక అధికారి మల్లికార్జున్‌యాదవ్‌ చేరుకొని సిబ్బంది సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

Advertisement

రెండు ఫైర్‌ ఇంజిన్లతో ఏకధాటిగా నీటిని చల్లడంతో రాత్రి 7 గంటలకు అగ్నికీలలు కొంత తగ్గడంతో వెంటనే క్రేన్‌ సాయంతో లారీని నిల్చోబెట్టారు. ట్యాంకర్‌కు రంద్రాలు చేసి ఇంధనాన్ని బయటకు పంపి నీరు చల్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పోలీసులు ఇతర మార్గాల్లో పంపించడం జరిగింది.

సంఘటనాస్థలికి 100 మీటర్ల దూరంలోనే ఓ పెట్రోల్‌ బంకు, దాన్ని ఆనుకునే బీసీ గురుకుల పాఠశాల ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. కాగా వెనుక టైర్‌ పగలడంతో లారీ అదుపుతప్పి బోల్తాపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్‌ గుండెనొప్పితో నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×