తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా సాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా ముగిసింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ఓట్ల లెక్కింపులో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. అనంతరం సర్పంచ్ పదవులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమయం 10 PM
కాంగ్రెస్: 2100
బీఆర్ఎస్: 1120
బీజేపీ: 244
ఇతరులు: 603
సమయం 9 గంటలు..
కాంగ్రెస్: 1950
బీఆర్ఎస్: 1050
బీజేపీ: 218
ఇతరులు: 550
సమయం 8 గంటలు..
కాంగ్రెస్: 1770
బీఆర్ఎస్: 950
బీజేపీ: 202
ఇతరులు: 494
సమయం సాయంత్రం 6:30 గంటలు:
కాంగ్రెస్: 1180
బీఆర్ఎస్: 520
బీజేపీ: 150
ఇతరులు: 330
సమయం 6 గంటలు..
కాంగ్రెస్: 990
బీఆర్ఎస్: 410
బీజేపీ: 120
ఇతరులు: 190
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది పరిస్థితి..
556/563+(1)
INC – 264
BRS – 140
BJP – 5
OTH – 47
ఒక సర్పంచ్ స్థానానికి నామినేషన్లు రాక, ఎన్నికలు జరగలేదు..
వరంగల్ జిల్లా:
ఏకగ్రీవం మిస్సయింది, ఒక్క ఓటుతో గెలిచింది.
సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠ రేపింది.
ఒకే ఒక్క ఎస్సీ ఓటర్ ఉన్న ఆశలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ కి రిజర్వ్.
ఒకే ఒక ఎస్సీ ఓటర్ కొంగర మల్లమ్మ ఏకగ్రీవం అంటూ ప్రచారం.
చివరి క్షణంలో ప్రేమ వివాహం చేసుకున్న ఎస్సీ యువతి ఎంట్రీ.
రెండు నామినేషన్లు రావడంతో రెండవ విడతలో పోలింగ్.
1647 ఓట్లు పోలవగా, 823 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి, 824 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి మల్లమ్మకు పోల్.
రెండు సార్లు కౌంటింగ్ నిర్వహించినా ఒకే ఓటుతో గెలిచిన కొంగర మల్లమ్మ.
ఏకగ్రీవం మిస్సయి, ఒకే ఓటుతో గెలవడంతో హాట్ టాపిక్ గా మారిన ఆశాలపల్లి ఎన్నిక.
పోటీలో ఉన్న అభ్యర్థులు
రెండో దశలో భాగంగా రాష్ట్రంలోని 193 మండలాల్లో గల 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు 29,917 వార్డు సభ్యుల పదవులకు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డు సభ్యుల కోసం 71,071 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గ్రామస్థాయిలో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రధాన పార్టీల మద్దతుదారులు హోరాహోరీగా తలపడ్డారు.
ఆధిక్యంలో కాంగ్రెస్.. రెండో స్థానంలో బీఆర్ఎస్..
ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక ఫలితాల సరళిని బట్టి చూస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కొన్ని జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీనిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు. రాత్రి లోపు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
సమయం 5:30 గంటలు
కాంగ్రెస్: 750
బీఆర్ఎస్: 290
బీజేపీ: 86
ఇతరులు: 236
సమయం 5 గంటలు..
కాంగ్రెస్: 550
బీఆర్ఎస్: 190
బీజేపీ: 50
ఇతరులు: 170
సమయం 4: 30
కాంగ్రెస్: 400
బీఆర్ఎస్: 120
బీజేపీ: 34
ఇతరులు: 134
ఇప్పటి వరకు..
కాంగ్రెస్: 369
బీఆర్ఎస్: 90
బీజేపీ: 27
ఇతరులు: 121
వరంగల్ జిల్లాలో ఇది పరిస్థితి..
కొనసాగుతున్న రెండవ విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య హోరాహోరీ
మొదటి విడత కంటే రెండవ విడతలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుస్తున్న బీఆర్ఎస్
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 139 కాంగ్రెస్, 65 బీఆర్ఎస్, బీజేపీ1, ఇండిపెండెంట్లు18 స్థానాల్లో గెలుపు
62% కాంగ్రెస్, 29% బీఆర్ఎస్, 8% ఇండిపెండెంట్లు
విజయోత్సవ ర్యాలీలకు నిషేధం ఉన్నా, సంబరాలు జరుపుకుంటున్న అభ్యర్థులు.