E-Paper
Advertisement

Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్

Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్

1. మూడో విడత పోలింగ్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

డిసెంబర్ 17న జరగబోయే మూడో విడత పోలింగ్‌‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ ఓటర్లకు పిలుపునిచ్చారు.

2. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. పద్మారావు గౌడ్‌పై ఆరోపణలు

తెలంగాణ జాగృతి కవిత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మారావ్ గౌడ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గురించి కూడా సంచలన కామెంట్లు చేశారు. సీతాఫల్మండీలో స్కూల్ ని కూలగొట్టి వదిలేశారనీ.. పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే ఈ స్కూలందని.. ఆయన కూడా దాన్ని వదిలేశారనీ ఆరోపించారు కవిత.

3. చలి గుప్పిట్లో తెలంగాణ.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రం చలిగాలుల తీవ్రతతో వణుకుతోంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఆదిలాబాద్‌లో 6.7°C, సంగారెడ్డిలో 6.5°C ఉష్ణోగ్రత నమోదైంది. చలిగాలుల దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

4. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలో దాదాపు 6 కిలోల పొడి గంజాయి ప్యాకెట్లు, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

5. మీర్‌పేట్ ప్రభుత్వ భూమి కబ్జాపై స్థానికుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ సర్కిల్ GHMC పరిధిలోని జిల్లెలగూడ, దాసరి నారాయణరావు కాలనీలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన.. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని స్థానిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని అన్నారు.

6. భార్యను గొంతు నులిమి చంపిన భర్త.. మృతదేహాన్ని తరలిస్తుండగా పట్టివేత

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరంలో భర్త వెంకటేష్, తన భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హత్య చేశాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లగా.. మాట్లాడదామని తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్య అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తుండగా పోలీసులు గమనించి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

7. వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం నేడు వైభవంగా జరిగింది. క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద గల కల్యాణ వేదికలో మహోత్సవాన్ని నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.

8. ఫేస్‌బుక్‌ ప్రేమలో పడి మోసపోయిన బంగారం వ్యాపారి

పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ బంగారం వ్యాపారి సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయాడు. ఫేస్‌బుక్‌లో ‘రుచి’ అనే పేరుతో పరిచయమైన గుర్తుతెలియని అమ్మాయి చాటింగ్ చేసి పరిచయం పెంచుకుంది. చివరికి తక్కువ ధరకే బంగారం, వెండి పంపిస్తానని నమ్మబలికి ఆ వ్యాపారిని మోసం చేసింది.

9. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు వేగవంతం: కేంద్రమంత్రి పెమ్మసాని

గుంటూరు శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా డిసెంబర్ 17 నాటికి ఒకవైపు పనులు పూర్తిచేసి, తర్వాత రెండోవైపు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జ్ కూల్చివేతకు నిపుణుల సంస్థలతో చర్చిస్తున్నామన్నారు.

10. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేటీకరణ వేగం.. మరో విభాగానికి టెండర్లు

విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగిస్తోంది. ఇటేవలే ప్లాంటులో 32విభాగాలను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించిన యాజమాన్యం.. కంటిన్యువస్ కాస్టింగ్ మెషిన్ భాగాన్ని
133 కోట్ల రుపాయలకు రెండేళ్ల కాంట్రాక్టుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించింది.

11. ఓటు వేసి వస్తూ కుప్పకూలిన వృద్ధుడు.. చేవెళ్లలో విషాదం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో 14వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటకు వచ్చిన సోలిపేట బుచ్చయ్య కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుచ్చయ్య కూతురు అదే వార్డులో పోటీలో ఉండగా.. ఓటు వేసేందుకు వచ్చి మృతి చెందాడు.

12. దోమకొండలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్‌పేట గ్రామ శివారులో చిరుత పులి సంచరించింది. చిరుత ఒక దూడపై దాడి చేయడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

13. ఓడిన అభ్యర్థికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి.. జగ్గారెడ్డి దాతృత్వం

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 22 ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థిని.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్గా నియమించారు. జగ్గారెడ్డి తన మంచి మనసు చాటుకుంటూ.. ఓటమిపాలైన అభ్యర్థికి ఈ కీలక పదవిని కేటాయించారు.

14. అభివృద్ధికి కాంగ్రెస్‌నే గెలిపించండి: ఎమ్మెల్యే సామేల్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరఫున తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పల్లెను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు.

15. మదనపల్లిలో వాజపేయి కాంస్య విగ్రహావిష్కరణ

మదనపల్లిలోని అన్నమయ్య కూడలిలో భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ముఖ్య అతిథిగా హాజరైయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

16. వెనెజువెలా నుంచి నార్వేకు విపక్ష నేత తరలింపు

వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో నోబెల్ శాంతి బహుమతి స్వీకరణ కోసం అజ్ఞాతం వీడి నార్వే చేరుకున్నారు. వెనెజువెలాలో నిషేధం ఉన్నప్పటికీ, ఆమెను తరలించడానికి అమెరికా మాజీ సైనిక నిపుణుల గ్రే బుల్ రెస్క్యూ ఫౌండేషన్ ‘ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్’ అనే రహస్య ఆపరేషన్ చేపట్టింది. వేషం మార్చి, పడవల్లో తరలించి, ఆమెను విజయవంతంగా గమ్యానికి చేర్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

17. ఢిల్లీ తీహార్ జైలు తరలింపు యోచనలో ప్రభుత్వం

ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్కరణ నిలయం తరలింపు వార్త చర్చనీయాంశంగా మారింది.

18. కాలుష్యంపై రాందేవ్ బాబా చిట్కాలు.. 

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం నేపథ్యంలో, యోగా గురువు రాందేవ్ బాబా చేసిన సూచనలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లు దుబారా ఖర్చులని ఆయన అభివర్ణించారు. దీనికి బదులుగా ప్రజలు తమ ఇళ్లకు కర్టెన్లు వేసుకోవాలని, ఇంట్లో కూర్చొని కపాలభాతి వంటి ప్రాణాయామాలు చేయాలని సూచించారు.

19. ఆసక్తిగా ‘ఇట్లు అర్జున’ టీజర్.. వాయిస్ ఓవర్ ఇచ్చిన నాగార్జున

దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న సినిమా టైటిల్‌ ఖరారైంది. ఇట్లు అర్జున అని పేరు పెట్టినట్లు టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు ప్రముఖ నటుడు నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో రూపొందించిన టీజర్‌ ఆసక్తిగా సాగింది. అనీశ్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు.

20. సీఎస్కేకు శ్రీకాంత్ సూచన.. వేలంలో బ్రేస్‌వెల్‌ను తీసుకోవాలి

డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026కి సంబంధించిన మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సారి రూ.43.40కోట్లతో వేలం బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సీఎస్కేకు కీలక సూచన చేశాడు. బ్రేస్‌వెల్‌ను వేలంలో దక్కించుకోవాలని సూచించాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×