E-Paper
Advertisement

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ
Advertisement

Phone Tapping Case Update: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చేటు చేసుకుంది. ఈ కేసు విచారణ మళ్లీ వేగవంతమైంది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని విచారించారు సిట్ అధికారులు. 2 గంటలు పాటు విచారించిన అధికారులు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Advertisement

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మళ్లీ స్పీడందుకుంది. ఇప్పటివరకు నిందితులు, బాధితుల నుంచి నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు అధికారులు. అందులోని సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినవారికి నోటీసులు ఇస్తున్నారు.

ఆ జాబితాలోకి మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి చేరారు.  ఈ కేసు నిమిత్తం ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. సేకరించిన సమాచారం ఆధారంగా దాదాపు 20 ప్రశ్నలు ఆయనపై సంధించినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటలపాటు విచారించి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు.

Advertisement

సిట్ ముందు మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ

గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధ కిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం అయ్యింది. రాధ కిషన్‌రావు తన స్టేట్మెంట్‌లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించారట. కేసీఆర్ కుటుంబంసభ్యులు, పార్టీలో సన్నిహితంగా ఉండి వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము వారితో పని చేశామని చెప్పారు. ఈ క్రమంలో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్‌ తీసుకున్నారు.

కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో వేర్వేరు పార్టీల నేతలు, వ్యాపార, సినీ రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఈసారి సొంత పార్టీ నేతలపై అప్పటి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎవరెవరి ఫోన్స్ ట్యాప్ చేశారు? అందుకు ఎలాంటి సాప్ట్‌వేర్ ఉపయోగించారు? ఓఎస్డీ చెబితే ఏ పనైనా జరిగేదని గతంలో విమర్శలు వచ్చాయి.

ALSO READ: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

ఫోన్, ల్యాప్ టాప్‌తో ఆయన విచారణకు హాజరైనట్టు సమాచారం. ఆయన ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్లాయి? అనేదానిపై కూపీ లాగారు. సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ రాజశేఖర్‌రెడ్డి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఓఎస్డీ ఇచ్చిన సమాధానాలు ఆధారంగా రానున్నరోజుల్లో రాజశేఖర్ రెడ్డి-ప్రభాకర్‌రావుని కలిపి విచారించే అవకాశమున్నట్లు సమాచారం.

 

Related News

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×