E-Paper
Advertisement

Attack on Journalist : టివి జర్నలిస్టుపై పోలీసు దాడి.. ఖండించిన రేవంత్ రెడ్డి

Attack on Journalist | ప్రశ్నించడం నేరమా? నిజమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం పాపమా? జరిగినదేంటో తెలుసుకోవడం.. నిజాన్ని వెలికి తీయడం మీడియా పని. కానీ ఆ పని చేసే ప్రయత్నం చేసినందుకు బిగ్‌ టీవీ ప్రతినిధిపై దాడికి దిగారు ఖాకీలు. తమ జులుం ప్రదర్శిస్తూ రిపోర్టర్‌పై దాడి చేసి కెమెరాను లాక్కున్నారు.

Attack on Journalist : టివి జర్నలిస్టుపై పోలీసు దాడి.. ఖండించిన రేవంత్ రెడ్డి
Attack on Journalist

Attack on Journalist(Latest news in telangana):

ప్రశ్నించడం నేరమా? నిజమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం పాపమా? జరిగినదేంటో తెలుసుకోవడం.. నిజాన్ని వెలికి తీయడం మీడియా పని. కానీ ఆ పని చేసే ప్రయత్నం చేసినందుకు బిగ్‌ టీవీ ప్రతినిధిపై దాడికి దిగారు ఖాకీలు. తమ జులుం ప్రదర్శిస్తూ రిపోర్టర్‌పై దాడి చేసి కెమెరాను లాక్కున్నారు.

బొరబండలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లింది బిగ్‌ టీవీ ప్రతినిధుల బృందం. దాడి విజువల్స్‌ ప్రసారం చేసింది. అసలు దాడి వెనుక కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ వారంతా SR నగర్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారని తెలుసుకొని అసలు జరిగింది ఏంటో వెలికి తీసే పనిలో పడింది. బాధితులను అప్రోచ్‌ అయ్యింది. వారి వర్షన్‌ ఏంటో తెలుసుకుని ప్రసారం చేసింది. అయితే ఇది నిజమా? కాదా? పోలీసుల విచారణలో ఏం తేలింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు SR నగర్ సీఐను సంప్రదించింది.

కానీ ఇంతలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఏసీపీ వెంకటేశ్వరరావు. కారు దిగడంతోనే బిగ్‌ టీవీ రిపోర్టర్ సైదులు, కెమెరామెన్ శ్రీకాంత్‌పై విరుచుకపడ్డారు. కెమెరా, లోగో లాక్కున్నారు.. రిపోర్టర్‌ను తోసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లారు. కేసు వివరాలేంటో చెప్పాలని ప్రశ్నించిన పాపానికి.. తాగి న్యూసెన్స్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ దుర్భాషలాడారు. ఇదేనా పోలీసులు వ్యవహరించాల్సిన తీరని ప్రశ్నిస్తూ ఖాకీల తీరును ఖండిస్తోంది బిగ్‌టీవీ యాజమాన్యం.

జర్నలిస్టు సైదులుపై acp దాడి చేయడాన్ని ఖండించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బిగ్ టీవీ రిపోర్టర్ మీద దాడి చేయడం దారుణమన్నారు. ఇది కచ్చితంగా మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని తెలిపారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియా వాళ్లు వారి విధులు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×