Uttarkhand Tunnel Rescue : ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్కియారీ సొరంగం నవంబర్ 12న కూలిపోయి.. 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఆ 41 మంది కార్మికులను NDRF(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం మంగళవారం బయటకు తీయగలిగింది.

గత 16 రోజులుగా ఈ 41 మంది కార్మికులు సొరంగంలోపలే చిక్కుకుపోయి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వారిని కాపాడేందుకు అత్యాధునిక టెక్నాలజీ వైఫల్యం చెందడంతో పాత విధానమైన ‘ర్యాట్ హోల్ మైనింగ్’ ద్వారా తవ్వకం చేసి ఒక గొట్టం నుంచి కార్మికులను బయటకు తీశారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనా స్థలానికి చేరుకొని బయటకు వచ్చిన కార్మికులను పలకరించారు.