Big Stories

Complaint on KCR | హామీలిచ్చి మోసం చేశారు.. కేసీఆర్, హరీష్​రావులపై పోలీసులకు ఫిర్యాదు!

Complaint on KCR | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావులపై భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరపున పోటీ చేసిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

మాజీ సిఎం కేసీఆర్.. భద్రాచలం ఆలయ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించకుండా భద్రాచలం ప్రజల, రామ భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని ఫిర్యాదులో ప్రదీప్ కుమార్ పేర్కొన్నాడు. ఆలయానకి రూ.100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని.. వరదలు వచ్చిన సమయంలో భద్రాచలం అభివృద్ధికి తక్షణమే కేటాయిస్తానన్న రూ.1000 కోట్ల నిధులు ఇవ్వలేదని, అలాగే దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు.

- Advertisement -

కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భద్రాచలం అభివృద్ధిపై హామీలు ఇచ్చి మాట తప్పారని ప్రదేప్ కుమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News